Increase Your Happiness : దిగులుగా అనిపిస్తుందా? మీ ఆనందాన్ని పెంచడానికి ఇలా చేసి చూడండి..!
ABN , First Publish Date - 2023-02-01T14:59:42+05:30 IST
వ్యాయామం మన మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

మనమందరం ఏదో ఒక సమయంలో కాస్త నిరాశలోకి వెళిపోతూనే ఉంటాం. ఈ దిగులు, నిరాశా అనేవి మనసును నిద్రపోయేలా చేస్తాయి. అందరితో కలుపుకోలుగా ఉండనీయవు. ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయాలు అందరి జీవితాల్లోనూ వస్తూనే ఉంటాయి. అయితే దీనిని ఎలా దాటాలనేది మాత్రం తెలిసి ఉండాలి.
మన హార్మోన్లు కొన్ని సమయాల్లో సెరోటోనిన్ స్థాయిలను పెంచడం, కోరికలను అణచివేయడం, నిద్ర సరిగా లేకపోవడం, అనారోగ్యం కలిగించే విధంగా శరీరతత్వం ఉండటం వంటి లక్షణాలను కలిగిస్తాయి. అయితే ఇవన్నీ హార్మోన్ల ప్రభావం మాత్రమే కాదు. మన మానసిక స్థితి కూడా దీనికి బాధ్యత వహిస్తుంది. దీనికి అప్పుడప్పుడూ సూర్యరశ్మిలో తిరుగుతూ ఉండాలి. దీనివల్ల శరీర సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. రోజువారి దినచర్యలో భాగంగా 15 నుంచి 20 నిమిషాల సమయాన్ని వెచ్చించి కొన్ని సులభమైన వ్యాయామాలు చేయవచ్చు.
వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం వల్ల శారీరకంగా ఫిట్‌గా ఉండగలమని, ఇది వివిధ జీవనశైలి రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుందని మనందరికీ తెలుసు, అయితే వ్యాయామం మన మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా. మన శరీరంలో సంతోషకరమైన హార్మోనులను పెంచి, మనల్ని గొప్ప మానసిక స్థితిలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్న మాట.
1) చురుకైన నడక: ఇది చాలా మంది, కొత్తగా ప్రారంభించే వారు, విరామం తర్వాత లేదా ఏదైనా గాయం తర్వాత చేయగలిగే అత్యంత ప్రాథమిక వ్యాయామం. 30 నిమిషాల నడక మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిజంగా ఉపయోగపడుతుంది.
2) రన్నింగ్: హృదయ, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక గొప్ప మార్గం అయితే, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 20-30 నిమిషాలు వారానికి 2-3 సార్లుగా ప్రారంభిస్తే అది మన ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తుంది.
3) బరువు శిక్షణ: శరీరంలోని కాళ్లు, ఛాతీ, భుజాలు, వీపు, చేతులు వంటి అన్ని ప్రధాన కండరాలకు సంబంధించిన వ్యాయామాలను వారానికి రెండు సార్లు బరువులు ఎత్తడం వల్ల ఎముక సాంద్రత, బలాన్ని మెరుగుపరుస్తుంది.
4) యోగా: వారానికి 2-3 రోజులు యోగా చేయడం మంచి అలవాటు ఇది, మొత్తం శారీరక బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది, అదే సమయంలో మన మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
5) హైకింగ్ లేదా ట్రెక్కింగ్: సహజమైన, పచ్చటి పరిసరాలలో చేసే ఏదైనా శారీరక శ్రమ ఖచ్చితంగా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచుతుంది.
6) క్రీడలు ఆడటం:స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ వంటి మీకు నచ్చిన క్రీడను వారానికి కనీసం 1-2 సార్లు ఒక గంట పాటు ఆడటం వలన మనసు రీఛార్జ్ అవుతుంది.