Fitness: ఖాళీ కడుపుతో వర్కవుట్స్‌ చేస్తే..!

ABN , First Publish Date - 2023-09-27T12:00:32+05:30 IST

ఖాళీ కడుపుతో వర్కవుట్స్‌ చేస్తే, కడుపు దగ్గర పేరుకునే మొండి కొవ్వు కరుగుతుందనీ, త్వరగా బరువు తగ్గవచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దీన్లో నిజమెంత?

Fitness: ఖాళీ కడుపుతో వర్కవుట్స్‌ చేస్తే..!

ఖాళీ కడుపుతో వర్కవుట్స్‌ చేస్తే, కడుపు దగ్గర పేరుకునే మొండి కొవ్వు కరుగుతుందనీ, త్వరగా బరువు తగ్గవచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దీన్లో నిజమెంత?

ఖాళీ కడుపుతో చేసే వ్యాయామాన్ని ఫాస్టెస్ట్‌ కార్డియో అంటారు. ఇలా వ్యాయామం చేయడం వల్ల, శరీరం మనం తీసుకున్న ఆహారం నుంచి కాకుండా తనలో పేరుకుని ఉన్న కొవ్వు, కార్బొహైడ్రేట్ల నుంచి శక్తిని సంగ్రహిస్తుందని అనుకుంటాం. కానీ నిజానికి వ్యాయామానికి ముందు సరిపడా పోషకాలు తీసుకోవడం వల్ల సమర్థంగా వ్యాయామం చేయగలగడంతో పాటు కండర నష్టాన్ని అరికట్టగలుగుతాం. అలాగే వ్యాయామం చేయడానికి సరిపడా శక్తి సమకూరి అలసిపోకుండా ఉంటాం. కాబట్టి వ్యాయమానికి 45 నిమిషాల ముందు ఒక పండు లేదా స్నాక్‌ తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లు తప్పనిసరిగా వ్యాయమానికి ముందు స్నాక్‌ తినాలి.

ఎలాంటి ఆహారం?

బ్లాక్‌ కాఫీ లేదా ప్రి వర్కవుట్‌ కెఫిన్‌ను ప్రివర్కవుట్‌ డ్రింక్‌గా తీసుకోవచ్చు. కార్బ్స్‌ తినాలనుకుంటే యాపిల్‌ లేదా పాలతో పాటు ఒక అరటిపండు లేదంటే కొన్ని డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవచ్చు. తినడానికి ఇష్టపడని వాళ్లు, గ్లూకోజ్‌, లేదా ఎలకొ్ట్రలైట్స్‌ కలిగిన నీళ్లను వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు తాగుతూ ఉండాలి.

Updated Date - 2023-09-27T12:00:32+05:30 IST