Summer Problems: ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు!

ABN , First Publish Date - 2023-03-07T12:17:26+05:30 IST

వేసవి వెతలకు ఆయుర్వేదంలో, హోమియో చికిత్సా విధానాలు కొన్ని చిట్కాలను సూచిస్తున్నాయి. అవేంటంటే...

Summer Problems: ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు!
ఉపశమనం పొందవచ్చు!

వేసవి వెతలకు ఆయుర్వేదంలో, హోమియో చికిత్సా విధానాలు కొన్ని చిట్కాలను సూచిస్తున్నాయి. అవేంటంటే...

ఆయుర్వేదం

పిత్త వేడికి సంబంధించినది కాబట్టి శరీర స్వభావం పిత్త అయినా, కాకపోయినా, వేసవిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పూర్వం లేని చిరాకు, విసుగు కనిపిస్తే మీలో పిత్త దోషం పెరుతున్నట్టు అర్ధం. ఈ లక్షణాలు మానసికమైనవైతే, అలసట, జుట్టు పొడిబారడం, పొట్టలో పుండ్లు, ఛాతీలో మంట లాంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. ఇవన్నీ శరీరంలో వేడి పెరిగింది అనడానికి సూచనలు. దీనికి విరుగుడు శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవడమే! ఇందుకోసం....

శీతలపానీయాలు కూడదు: చల్లదనం వేడికి విరుగుడు అనుకుంటాం. కానీ ఆహారం విషయంలో ఈ సూత్రం వర్తించదు. చల్లని శీతలపానీయాల వల్ల జీర్ణాగ్ని హెచ్చుమీరి అజీర్తి కలుగజేస్తుంది. కాబట్టి చల్లని నీరు, శీతలపానీయాలు తీసుకోకూడదు. బదులుగా గది ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉన్న తాజా నీరు తాగాలి.

చల్లదనాన్నిచ్చే ఫలాలు, కూరగాయలు: పుచ్చ, ద్రాక్ష, దోస లాంటి పళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే పాలు, వెన్న, నెయ్యి కూడా శరీర వేడిని తగ్గిస్తాయి. దోసకాయ, బ్రొకొలి, కాలీఫ్లవర్‌ మొదలైన కూరగాయలు కూడా శరీర వేడిని విరుస్తాయి. వీటితోపాటు నీరు ఎక్కువగా ఉండే బీరకాయలు, పొట్టకాయలు కూడా తింటూ ఉండాలి.

ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..

హోమియోపతి

ఎండ వేడిమి వల్ల తలనొప్పి, ఒళ్లు నొప్పులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే హోమియో చిట్కాలను అనుసరిస్తే ఎండదెబ్బకు గురవకుండా ఉంటాం! అవేంటంటే...

బెల్లడోనా: వేడిమి కారణంగా ముఖం నుంచి వేడి ఆవిర్లు వెలువడినా, కనుగుడ్లు తేలిపోతూ, విపరీతమైన తలపోటు ఉన్నా, స్వేదం లేకున్నా ఉక్కపోతగా తోచినా బెల్లడోనా తీసుకోవాలి.

బ్రయోనియా: ఎండలో ఉన్నంతసేపు ఎలాంటి తలనొప్పి లక్షణం కనిపించకపోయినా, సాయంత్రానికి లేదా మరునాటికి మొదలైతే బ్రయోనియా మందు తీసుకోవాలి.

ఫెర్రమ్‌ ఫాస్‌: ఈ ఐరన్‌ సెల్‌ సాల్ట్‌, కణతల దగ్గర తలెత్తే నొప్పికి చక్కని విరుగుడు.

పల్సటిల్లా: కత్తితో పొడిచినట్టు తల మొత్తం బాధిస్తున్నప్పుడు పల్సటిల్లా వాడాలి.

క్యాంథారిస్‌: ఎండకు కమిలిన చర్మం కోసం ఒకటి లేదా రెండు మోతాదుల క్యాంథారిన్‌ వాడాలి.

అర్టికా యురెన్స్‌: చమటపొక్కుల వల్ల కలిగే నొప్పి, మంటల నుంచి ఉపశమనం కోసం ఈ మందును ఆ ప్రదేశాల్లో వాడవచ్చు.

Updated Date - 2023-03-07T12:17:26+05:30 IST