Ear: చెవి పోటుతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2023-06-01T10:51:48+05:30 IST

చలి, సైనసైటిస్‌, పంటి నొప్పి.. ఇలా చెవి పోటుకు ఎన్నో కారణాలుంటాయి. అయితే చెవి పోటుకు ఆయుర్వేదంలో

Ear: చెవి పోటుతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!
Ear infection

చలి, సైనసైటిస్‌, పంటి నొప్పి.. ఇలా చెవి పోటుకు ఎన్నో కారణాలుంటాయి. అయితే చెవి పోటుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలున్నాయి. అవేంటంటే...

కర్ణ పురాణ: కర్ణ పురాణమంటే చెవిలో నూనె చుక్కలు పోయడం అని అర్థం. వేర్వేరు నూనెలు, చెవి పోటుకూ, చెవిలోని ఇన్‌ఫెక్షన్‌కూ సహాయపడి, చెవులను శుభ్రం చేస్తాయి.

తులసి: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కలిగిన తులసి ఆకులను దంచి, రసాన్ని వడగట్టి రెండు చుక్కలు చెవిలో పోస్తే, చెవి పోటు అదుపులోకి వస్తుంది.

లవంగ నూనె: అనాల్జెసిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన లవంగ నూనె తయారీ కోసం కొన్ని లవంగాలను నువ్వ ల నూనెలో వేసి, మరిగించి చల్లార్చాలి. చల్లారిన తర్వాత, వడగట్టి, చెవుల్లో ఒకటి లేదా రెండు చుక్కలు పోయాలి.

నువ్వుల నూనె లేదా ఆలివ్‌ నూనె: చెవి పోటుకు నువ్వుల నూనె ప్రభావవంతంగా పని చేస్తుంది. నువ్వుల నూనెను వేడిచేసి, చల్లార్చి చెవిలో రెండు చుక్కలు పోస్తే, చెవి పోటు అదుపులోకి వస్తుంది.

పైపూత మందులు

వెల్లుల్లి: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన వెల్లుల్లి వాపు, నొప్పిలను తగ్గిస్తుంది. కాబట్టి మూడు వెల్లుల్లి రెబ్బలను వేడి చేసి, మెత్తగా దంచి, వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో పట్టు వేయాలి.

అల్లం: ఇయర్‌ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. ఇందుకోసం అల్లాన్ని దంచి, రసం తీసి, నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి.

యూకలిప్టస్‌: వేడి నీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ నూనె వేసి, ఆవిరి పట్టడం వల్ల సైనస్‌లు శుభ్రమై చెవి పోటు కూడా అదుపులోకి వస్తుంది.

Updated Date - 2023-06-01T10:51:48+05:30 IST