Carbohydrates: పిండి పదార్థాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2023-10-10T12:58:49+05:30 IST

పిండి పదార్థాలను పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. వాటిలో మంచి, చెడు పిండి పదార్థాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి.

Carbohydrates: పిండి పదార్థాలపై అవగాహన అవసరం

పిండి పదార్థాలను పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. వాటిలో మంచి, చెడు పిండి పదార్థాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి.

చెడు పిండి పదార్థాలు (సింపుల్‌ కార్బొహైడ్రేట్స్‌)

ఇవన్నీ పొట్టు తీసి, పాలిష్‌ చేసిన పదార్థాలు. వీటిలో సహజసిద్ధ పోషకాలు, పీచు తక్కువ. చెడు పిండిపదార్థాల్లో....

  • పీచు, పోషకాలు అతి స్వల్పం

  • గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ

  • క్యాలరీలు కొవ్వుగా మారతాయి

  • అత్యధిక గ్లూకోజ్‌ స్థాయులు (నీరసం తెప్పిస్తాయి)

చాక్లెట్లు, తీపి పదార్థాలు, తీపి జోడించిన తృణధాన్యాలు, సోడాలు, శీతల పానీయాలు, పొట్టు తీసిన పిండ్లు ఈ కోవకు చెందినవి.

మేలురకం పిండిపదార్థాలు వీటిలో...

ఓట్స్‌తో తయారైన బిస్కెట్లు, నారింజ రసం, యాపిల్‌, కేరట్లు, టమేటాలు, ఎండుద్రాక్ష, ద్రాక్ష, అరటిపళ్లు.

ఓట్‌మీల్‌: ఎక్కువ సమయంపాటు శక్తినిచ్చే నిలకడైన పిండిపదార్థం ఇది. నీళ్లు కలిపి తయారుచేసిన ఒక కప్పు ఓట్‌మీల్‌లో 159 క్యాలరీలు ఉంటాయి. 4 గ్రాములు పీచు, 6 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి.

యాపిల్‌: భోజనానికి, భోజనానికి మధ్య తీసుకోవలసిన ఈ అల్పాహార ఫలంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే 4 గ్రాముల పీచు, పెక్టిన్‌లు ఉంటాయి. మాంసకృత్తులు పుష్కలంగా ఉండే వేరుసెనగపప్పుతో తయారయ్యే వెన్నతో కలిపి తీసుకుంటే ప్రయోజనకరం.

చిలకడదుంపలు: ఇది నిజమైన ‘సూపర్‌ ఫుడ్‌’. కప్పు చిలకడదుంప ముక్కల్లో 7 గ్రాముల పీచు, అత్యధిక విటమిన్‌ ఎ,

మినుములు: ఒక కప్పు ఉడకబెట్టిన పొట్టు తీయని మినుముల్లో 15 గ్రాముల పీచు, అంతే పరిమాణంలో మాంసకృత్తులు ఉంటాయి. ఇంత పరిమాణంలో పోషకాలు మరే పదార్థంలోనూ ఉండవు.

టమేటాలు: వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలం. పీచుతో పాటు లైకోపీన్‌ అనే యాంటీఆక్సిడెంటు కూడా వీటిలో ఉంటాయి.

Updated Date - 2023-10-10T12:58:49+05:30 IST