Share News

Almond vs Regular milk: బాదం పాలు మంచివా..? రోజూ వాడే గేదె పాలు మంచివా..? ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..!

ABN , First Publish Date - 2023-11-27T16:36:11+05:30 IST

ఆవుపాలలో మామూలుగానే లాక్టోస్ ఉంటుంది. ఇది కొంతమంది వ్యక్తులకు జీర్ణ సమస్యలను తెస్తుంది.

 Almond vs Regular milk: బాదం పాలు మంచివా..? రోజూ వాడే గేదె పాలు మంచివా..? ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..!
health benefits

ఆహారం తీసుకోవడం అంటే అది శరీరానికి ఆరోగ్యాన్ని, వ్యాధులనుంచి కాపాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచేదిగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే ఆహారాలలో పాలు చాలా కీలకమైన ఆహారం. అలాగే ఈ పాలలో బాదంపాలు, సాధారణ గెదె పాలను రెండిటినీ కలిపి చూస్తే దేనిలో ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి. రెగ్యులర్ ఆవు పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ కూడా ఉంటాయి.

పాలతో పోలిస్తే బాదం పాలలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇది విటమిన్ ఇ కి మంచి మూలం, ఈ ఆహారం చర్మం, జుట్టు పెరుగుదలకు యాంటీ ఆక్సిడెంట్స్ సహకరిస్తుంది.

చక్కెర కంటెంట్..

ఆవుపాలలో మామూలుగానే లాక్టోస్ ఉంటుంది. ఇది కొంతమంది వ్యక్తులకు జీర్ణ సమస్యలను తెస్తుంది. బాదం పాలలో తక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: జిమ్‌కు వెళ్లనక్కర్లేదు.. భోజనం మానక్కర్లేదు.. ఈజీగా ఎలా బరువు తగ్గొచ్చంటే..!


రుచి..

పాలు రుచికి క్రీము రుచిని కలిగి ఉంటే, బాదం పాలు నట్టి రుచిని కలిగి ఉంటాయి.

బాదం, ఆవు పాలలో ఉండే ప్రత్యేక రుచి,. ప్రోటీన్స్ ఆరోగ్యానికి మంచి సపోర్ట్ కావచ్చు. కానీ రెగ్యులర్ పాలు ప్రోటీన్, కాల్షియం మూలం. అవి పిల్లలకి, పెద్దలకూ బలాన్నిస్తాయి..ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-27T16:36:13+05:30 IST