Share News

Weight Loss: జిమ్‌కు వెళ్లనక్కర్లేదు.. భోజనం మానక్కర్లేదు.. ఈజీగా ఎలా బరువు తగ్గొచ్చంటే..!

ABN , First Publish Date - 2023-11-27T15:47:05+05:30 IST

ఈ డైట్ ఫ్లాన్‌లో ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు.

Weight Loss: జిమ్‌కు వెళ్లనక్కర్లేదు.. భోజనం మానక్కర్లేదు.. ఈజీగా ఎలా బరువు తగ్గొచ్చంటే..!
weight

చాలా కాలంగా బరువు తగ్గలేక దానికోసం చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయుంటారు. కానీ వ్యాయామానికి సమయం దొరకడం లేదని, తింటి తగ్గించేందుకు మనసు రావడం లేదని తెగ ఫీల్ అయ్యేవారంతా ఈ బరువును వదిలించుకోవడానికి మరో కొత్త దారిని పట్టుకుంటే ఫలితం ఉంటుంది అంటున్నారు వైద్యులు. అదే వాల్యూమెట్రిక్ డైట్.. దీని గురించి డైటింగ్ లేకుండగానే బరువు తగ్గే విధానం గురించి తెలుసుకుందాం.

డైటింగ్ లేకుండా బరువు తగ్గాలనుకునే వారికి వాల్యూమెట్రిక్ డైట్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆకలిని చంపుకోవలసిన అవసరం అయితే ఈ పద్దతిలో ఉండదు. శుభ్రంగా తినేస్తూనే కడుపు మార్చుకోవాల్సిన పని లేకుండానే బరువు తగ్గిపోవచ్చు. అయితే ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి ఈ పద్దతికి అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ డైట్‌లో, తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఫుడ్‌తో బరువు తగ్గడం జరుగుతుంది. ఈ డైట్ లో తీసుకునే పదార్థాలతో కడుపు నిండిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. తక్కువ కేలరీల కారణంగా బరువు కూడా తేలిగ్గా తగ్గగలరు.

వాల్యూమెట్రిక్ డైట్‌లో పోషకాహారం ఎక్కువగా ఉంటాయి. ఇది బరువును తగ్గించేందుకు సహకరిస్తుంది. అలాగే శరీరంలో ఏర్పడిన నీటి కొరతను కూడా తొలగిస్తుంది. ఈ డైట్‌లో కడుపు నిండిన అనుభూతితో పాటు ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయలేకపోయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ కేలరీల ఆహారాలను మాత్రమే ఎంచుకోవాలి. ఈ డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. దీని వల్ల అదనపు కేలరీలు వినియోగించబడవు. ఈ డైట్‌ని ఎక్కువ కాలం పాటిస్తే బరువు అనేది తగ్గి పెద్ద సమస్యను సులువుగా దాటేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితం కూడా అంతే ఫాస్ట్‌గా ఉంటుంది.

వాల్యూమెట్రిక్ ఎలా పని చేస్తుంది.

ఈ డైట్ కూడా దాని స్వంత కొన్ని నియమాలతో పనిచేస్తుంది. వాల్యూమెట్రిక్ డైట్ నాలుగు భాగాలుగా విభజించవచ్చు. మొదటి దశలో పిండి లేని పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. రెండో దశలో ఎక్కువ తృణధాన్యాలను తీసుకోవాలి. ఇక మూడవ దశలో కొన్ని స్నాక్స్‌ను తక్కువ పరిమాణంలో తినచ్చు. నాల్గవ దశలో కొన్ని కొవ్వు పదార్థలను కూడా తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: అసలేంటీ ఈ వాటర్ ఫాస్టింగ్..? 72 గంటల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగితే లాభమా..? నష్టమా..?



వాల్యూమెట్రిక్ డైట్‌లో ఏమి తినాలి.

వాల్యూమెట్రిక్ డైట్ ప్రకారం కేలరీలు తక్కువగా ఉన్న ఫైబర్, నీరు, పోషకాహారం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, బీన్స్, లీన్ మాంసం, తక్కువ కొవ్వు చేప.

వాల్యూమెట్రిక్ డైట్ ప్రయోజనాలు.. ఏంటి?

వాల్యూమెట్రిక్ అనేది ఆహారంతో పాటు అరగంట వ్యాయామం కూడా చేరితే మంచి ఫలితం ఉంటుంది.

1. ఈ ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

2. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

3. ఈ డైట్ ఫ్లాన్‌లో ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు.

4. ఈమఆహారం అనువైనది, సులభంగా ఆచరించవచ్చు.

5. ఈ డైట్‌లో ఐస్ క్రీమ్, చాక్లెట్, స్నాక్స్ కూడా తినేయచ్చు.

Updated Date - 2023-11-27T15:47:15+05:30 IST