Bengalore: అసలు బెంగళూరు నగర జనాభా ఎంత..?

ABN , First Publish Date - 2023-05-03T13:18:49+05:30 IST

బెంగళూరు నగర(Bangalore city) జనాభాకు సంబంధించిన గణాంకాల వివరాలపై గందరగోళం నెలకొని ఉంది.

Bengalore: అసలు బెంగళూరు నగర జనాభా ఎంత..?

- గణాంకాల వివరాలపై గందరగోళం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగర(Bangalore city) జనాభాకు సంబంధించిన గణాంకాల వివరాలపై గందరగోళం నెలకొని ఉంది. 2011తో పోలిస్తే నగర జనాభా బాగా పెరిగిందని అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలో ఓటర్ల సంఖ్య 97.1లక్షలుగా ఉంది. ఈ లెక్కన జనాభా కనీసం 1.65 కోట్లు ఉండాలని అధికారులు మదింపు వేస్తున్నారు. ఆనేకల్‌ తాలూకాలోని 4లక్షలమంది ఓటర్లను పక్కన పెట్టినా నగరజనాభా 1.6 కోట్లు ఖాయమని అంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగళూరు జనాభా 96.2 లక్షలుగా నమోదైంది. పదేళ్లలో నగర విస్తీర్ణం పెరగడం అందుకు అనుగుణంగా జనాభా పెరుగుదలతోపాటు వలసల సంఖ్య పెరగడం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గరిష్ఠంగా నగర జనాభా 1.5కోట్లు దాటేసిందని అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు, వార్డులవారీగా గ్రాంట్ల కేటాయింపు వంటి అంశాలకు జనాభాయే ప్రాతిపదక కావాలని భావిస్తున్నారు.

pandu5.2.jpg

Updated Date - 2023-05-05T19:09:51+05:30 IST