MSDE: అప్రెంటిస్‌షిప్‌పై విశాఖలో రెండు రోజుల అవగాహన వర్క్‌షాప్

ABN , First Publish Date - 2023-02-01T21:09:40+05:30 IST

అప్రెంటిస్‌షిప్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు యువత

 MSDE: అప్రెంటిస్‌షిప్‌పై విశాఖలో రెండు రోజుల అవగాహన వర్క్‌షాప్

విశాఖపట్నం: అప్రెంటిస్‌షిప్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు యువత అప్రెంటిస్‌షిప్‌ను స్వీకరించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వశాఖ (MSDE) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 250కిపైగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా సంస్థలు ఔత్సాహికులు, భాగస్వాముల మధ్య అప్రెంటిస్‌షిప్‌ సంస్కరణలపై అవగాహన కల్పించనున్నారు. రీజనల్‌ డైరెక్టరేట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఎంఎస్‌డీఈ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. చదువుకుంటూనే పనిచేయడమనేది ఎడ్యుకేషన్‌ టు వర్క్‌ ట్రాన్సిషన్‌లో నిలకడైన విధానమని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌ల నిర్వహణ ద్వారా అప్రెంటిస్‌షిప్‌ ప్రయోజనాలను యువత, వ్యాపార సంస్ధలకు వెల్లడిస్తున్నామన్నారు. అప్రెంటిస్‌షిప్‌ చట్టం-1961 సంస్కరణల కారణంగా యువత అత్యుతమ శిక్షణ పొందగలరని అన్నారు.

ఈ తరహా వర్క్‌షాప్‌‌ను ఈ నెల 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. మొదటి రోజు వర్క్‌షాప్‌ను కంచరపాలెం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు, డీఈటీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ శిక్షణా సంస్థలు (ITI), ఎంఎస్‌ఎంఈలు, బోట్‌, జన్‌ శిక్షణ్‌ సంస్ధాన్‌ (JSS), నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (NSDC), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్‌ (APSSDC), సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌ (SSC) పాల్గొన్నారు.

తొలి రోజు వర్క్‌షాప్‌ను ఐఎస్‌డీఎస్‌ , రీజనల్‌ డైరెక్టర్‌ (AP&TS) కె. శ్రీనివాస్‌రావు ప్రారంభించనున్నారు. రెండో రోజు వర్క్‌షాప్‌ కంచరపాలెంలోని ఐటీఐలో నిర్వహిస్తారు. ఐటీఐలతో పాటుగా ఇతర వొకేషనల్‌ కోర్సుల ట్రైనీలకు శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌ను ఎంఎస్‌డీఈ, ఎన్‌ఎస్‌డీసీ, నిమి, ఎంఎస్‌ఎంఈ, డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ (డీఐ) , ఆర్‌డీఎస్‌డీఈల మార్గనిర్దేశకత్వంలో నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-02-01T21:09:41+05:30 IST