WeMakeScholars: 12న హైదరాబాద్‌లో స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో

ABN , First Publish Date - 2023-03-09T17:48:32+05:30 IST

దేశంలోని అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో (SAFE) ఈ నెల 12న హైదరాబాద్‌

WeMakeScholars: 12న హైదరాబాద్‌లో స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో (SAFE) ఈ నెల 12న హైదరాబాద్‌ బేగంపేటలోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ సమీపంలోని మనోహర్ హోటల్‌లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఎక్స్‌పో సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. దేశంలోని అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ప్లాట్‌ఫాం ‘వియ్ మేక్ స్కాలర్స్’ (WeMakeScholars) దీనిని నిర్వహిస్తోంది. ఈ సంస్థ గతేడాది రూ. 4,200 కోట్ల ఎడ్యుకేషన్ రుణాలను విద్యార్థులకు అందించింది.

విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు సాయం చేసేందుకు యూకే ప్రభుత్వ స్కాలర్‌షిప్ విజేతలైన అర్జున్ ఆర్ కృష్ణ, దామిని మహాజన్ ఏడేళ్ల క్రితం దీనిని ప్రారంభించారు. ఇప్పుడిది ఉన్నత విద్యా ఫైనాన్స్ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. 26 వేలకుపైగా అంతర్జాతీయ స్కాలర్‌షిప్ యాక్సెస్‌ను అందించే స్కాలర్‌షిప్ పోర్టల్‌ను వీరు నిర్మించారు. దేశంలో అతి తక్కువ వడ్డీ రేట్లతో విద్యార్థులు రుణాలను పొందడంలో సాయం చేస్తున్నారు.

సేఫ్ 2023లో విద్యార్థులకు అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ల గురించి తెలుసుకునేందుకు, దేశంలోని అతి తక్కువ వడ్డీ రేట్లతో 14కుపైగా బ్యాంకుల నుంచి తక్షణ విద్యా రుణం ప్రీ శాంక్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్‌పోలో అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌తోపాటు ఇతర యూరోపియన్ దేశాలలో ఈ ఏడాది ఫాలో ఇన్‌టేక్ 2023లో చదువుకునేందుకు ప్లాన్ చేస్తున్న విద్యార్థులతోపాటు, భవిష్యత్తులో ఇన్‌టేక్‌లలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

SAFE 2023 కోసం రిజిస్టర్ చేసుకునేందుకు విద్యార్థులు https://www.wemakescholars.com/study-abroad-funding-expo-safe లింక్ ను విజిట్ చేయొచ్చు. అలాగే, మరింత సమాచారం కోసం, www.WeMakeScholars.com వెబ్‌సైట్ ను విజిట్ చేయొచ్చు.

Updated Date - 2023-03-09T17:48:32+05:30 IST