మధ్యాహ్న భోజనం మెనూ మారింది! ఈసారి వారానికి మూడ్రోజులు..!

ABN , First Publish Date - 2023-06-02T12:22:36+05:30 IST

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2023-24)లో అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెనూ ఖరారైంది. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల

మధ్యాహ్న భోజనం మెనూ మారింది! ఈసారి వారానికి మూడ్రోజులు..!
menu changed

వారంలో మూడు రోజులు కోడి గుడ్డు

కిచిడి, వెజిటబుల్‌ బిర్యానీ, తదితరాలు

ఈ నెల 12 నుంచి పాఠశాలల్లో అమలు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2023-24)లో అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెనూ ఖరారైంది. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల నిధులతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగా సోమ, బుధ, శుక్రవారాల్లో ఉడికించిన కోడిగుడ్డును అందించనున్నారు. అలాగే... భోజనంలో భాగంగా కిచిడి, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, సాంబారు, రైస్‌, ఆకుకూరతో చేసిన పప్పు, వెజిటబుల్‌ బిర్యానీ వంటి వాటిని అందించనున్నారు. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కానుండడంతో అదే రోజు నుంచి ఈ మెనూతో మధ్యాహ్న భోజనాన్ని అందించాలని అన్ని జిల్లాల విద్యాధికారులకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేన ఆదేశాలను జారీ చేశారు.

menu.jpg

Updated Date - 2023-06-02T12:23:06+05:30 IST