ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు నోటిఫికేషన్

ABN , First Publish Date - 2023-05-13T13:59:20+05:30 IST

ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూఎస్‌ఐబీ)- మూడేళ్ల బీబీఏ, అయిదేళ్ల బీబీఏ+ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి

ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు నోటిఫికేషన్
Andhra University

ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూఎస్‌ఐబీ)- మూడేళ్ల బీబీఏ, అయిదేళ్ల బీబీఏ+ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌లకు విశాఖ ఐఐఎం సహకారం అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లో మొదటి మూడేళ్ల తరవాత కోర్సు నుంచి వైదొలగే వీలుంది. వీరికి బీబీఏ డిగ్రీ ఇస్తారు. గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. మొత్తం 120 సీట్లు ఉన్నాయి.

బీబీఏ+ఎంబీఏ వివరాలు

  • ప్రోగ్రామ్‌లో భాగంగా ఫౌండేషన్‌ కోర్సులు, కోర్‌ కోర్సులు, ఎలక్టివ్‌ కోర్సులు, ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌, కేస్‌ స్టడీస్‌, విదేశీ ప్రొఫెసర్ల ఆన్‌లైన్‌ లెక్చర్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఉంటాయి. ఏటా కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.

  • క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌, క్రిటికల్‌ థింకింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లీడర్‌షిప్‌, టీంవర్క్‌, బిజినెస్‌ ఎథిక్స్‌, స్ట్రాటజిక్‌ అనాలిసిస్‌, లైఫ్‌ స్కిల్స్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.

స్పెషలైజేషన్‌లు: మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్‌తో ద్వితీయశ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: మే 15

గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: మే 16 నుంచి 18 వరకు

సీట్ల కేటాయింపు: మే 18

చిరునామా: డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్‌, పెద వాల్తేర్‌, విశాఖపట్నం-530017

వెబ్‌సైట్‌: audoa.in

Updated Date - 2023-05-13T13:59:20+05:30 IST