Muzigal: కూకట్‌పల్లిలో అత్యాధునిక మ్యూజిక్ అకాడమీ

ABN , First Publish Date - 2023-03-31T20:12:53+05:30 IST

దేశంలోని అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌‌ఫామ్ మ్యూజిగల్(Muzigal Academy)

Muzigal: కూకట్‌పల్లిలో అత్యాధునిక మ్యూజిక్ అకాడమీ

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌‌ఫామ్ మ్యూజిగల్(Muzigal Academy) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ మూడో అకాడమీని ప్రారంభించింది. ఈ అత్యాధునిక సెంటర్‌లో 500 మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్ణాటక వోకల్స్, హిందూస్థానీ వోకల్స్, వెస్ట్రన్ వోకల్స్ వంటి వాటిని నేర్పిస్తారు. ఇందులో చేరిన ప్రతి ఒక్కరికీ నెల రోజులపాటు ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తారు. అంతేకాదు, సంగీత పరికరాలను కూడా ఇక్కడ కొనుగోలుకు అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ.. సంగీతాన్ని అందరికీ చేరువ చేయాలన్న మహోన్నత లక్ష్యంతో మ్యూజిగల్ అకాడమీని తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఇక్కడ భారతీయ శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఓ నిర్ణీత కరిక్యూలమ్, పీరియాడిక్ అసెసె‌మెంట్, సర్టిఫికేషన్, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాను ఉంటాయన్నారు. అలాగే, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నట్టు తెలిపారు. ఇండియాతోపాటు యూఎస్, యూకే, యూఏఈలలో 10 వేల మంది విద్యార్థులకు 400 మందికిపైగా సుశిక్షితులైన మ్యూజిక్ టీచర్లు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 40 వేల తరగతులను విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు.

Updated Date - 2023-03-31T20:12:53+05:30 IST