Telangana Inter studentsకి గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2023-01-06T11:33:58+05:30 IST

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల (Intermediate students)కు ఇంటర్న్‌షిప్‌ (Internship) అవకాశాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి గల విద్యార్థులకు వివిధ రంగాల్లో

Telangana Inter studentsకి గుడ్‌న్యూస్!
4 వేల స్టైపెండ్‌..

4 వేల స్టైపెండ్‌.. త్వరలో రిలయన్స్‌తో టై

20 కాలేజీలకు దక్కని గుర్తింపు

5 వేల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం?

వారాంతం లేదా సెలవు రోజుల్లో నిర్వహణ

వివిధ రంగాల్లో అనుభవ కల్పన..

ప్రశ్నార్థకంగా 5 వేల మంది విద్యార్థుల భవిషత్తు?

హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యార్థుల (Intermediate students)కు ఇంటర్న్‌షిప్‌ (Internship) అవకాశాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి గల విద్యార్థులకు వివిధ రంగాల్లో అనుభవాన్ని కల్పించనున్నారు. ఈ అంశంపై ఇంటర్మీడియట్‌ బోర్డు (Intermediate Board) అధికారులు గురువారం నాడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రిలయన్స్‌ సంస్థ (Reliance Company) ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా ఇంటర్న్‌షిప్‌ను ఎలా నిర్వహించాలి‌ అనే అంశంపై చర్చించారు. వారాంతంలో లేదా సెలవుల్లో రోజుకు 4 గంటల పాటు ఈ ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులకు నెలకు రూ. 4 వేలు స్టయిఫండ్‌ (stipend)ను కూడా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఆధ్వర్యంలో ఉన్న గార్మెంట్స్‌, డిజిటల్‌(Digital) వంటి పలు విభాగాల్లో ఈ ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఇంటర్‌ బోర్డు అధికారులు రిలయన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు.

20 కాలేజీలకు దక్కని అఫిలియేషన్‌!

రాష్ట్రంలోని 20 జూనియర్‌ కాలేజీలకు అఫిలియేషన్‌ దక్కలేదు. అఫిలియేషన్‌ జారీ గడువు ముగియడంతో ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు ప్రతి ఏడాదీ అఫిలియేషన్‌ జారీ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. అఫిలియేషన్‌ ఉంటేనే, అందులో చదువుతున్న విద్యార్థులను రెగ్యులర్‌ కోటా కింద పరిగణిస్తారు. లేకపోతే సదరు విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలను రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అఫిలియేషన్‌ దక్కని కాలేజీల్లో సుమారు 5 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నట్టు సమాచారం. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ కాలేజీలకు అధికారులు అఫిలియేషన్‌ను నిలిపివేసినట్టు తెలిసింది.

Updated Date - 2023-01-06T11:35:37+05:30 IST