విదేశీ విద్యకు భారతీయుల ఆసక్తి

ABN , First Publish Date - 2023-01-25T11:03:35+05:30 IST

విదేశాల్లో ఉన్నత విద్య (higher education) అభ్యసించేందుకు భారతీయులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారని స్టడీ గ్రూప్‌

విదేశీ విద్యకు భారతీయుల ఆసక్తి

గతేడాది 1.09 మిలియన్‌ ప్రవేశాలు

వివిధ దేశాల్లోని కాలేజీల్లో భారీగా ఎన్‌రోల్‌మెంట్‌

స్టడీ గ్రూప్‌ సీఈవో ఇయాన్‌ క్రిచ్టన్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్నత విద్య (higher education) అభ్యసించేందుకు భారతీయులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారని స్టడీ గ్రూప్‌ సీఈవో ఇయాన్‌ క్రిచ్టన్‌ అన్నారు. వివిధ దేశాల్లోని కాలేజీల్లో ఏటా పెరుగుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) ఎన్‌రోల్‌మెంట్‌ ఇందుకు నిదర్శనమని తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం ‘అంతర్జాతీయ విద్య ద్వారా ఆధారితమైన, స్థిరమైన ప్రపంచ అభివృద్ధి’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇయాన్‌ క్రిచ్టన్‌ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ ప్రధాన కార్యాలయ (British headquarters) సంస్థ భారతీయ విద్యార్థుల నమోదులో 2020-22లో వంద శాతం పెరుగుదలను నమోదు చేసుకుందని తెలిపారు. గతేడాది 1.09 మిలియన్‌ మంది భారతీయ విద్యార్థులు 85 దేశాల్లో చదువుకునేందుకు వెళ్లారని, 2023 ముగిసేలోపు ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందన్నారు. 12 నెలల్లో స్టడీ గ్రూప్‌ అమెరికన్‌ భాగస్వామి విశ్వవిద్యాలయాలకు 2.5 రెట్ల విద్యార్థుల నమోదులు పెరిగాయని, స్టెమ్‌ ప్రోగ్రాం లాంచ్‌లతో ముడిపడిన పెరుగుదల భారతీయ విద్యార్థులు ఏ 1, మానవ కంప్యూటర్‌ (Computer), ఇంటారాక్షన్‌, వీఆర్‌లో అత్యాధునిక అభివృద్ధిని అధ్యయనం చేయాలనే వారి ఆశయాలకు దోహదపడుతుందన్నారు. స్టడీ గ్రూప్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కరణ్‌ లలిత్‌ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు ఇటీవల యూకేలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో అతిపెద్ద సమూహమైన చైనా జాతీయులను అధిగమించడం సంతోషకరమన్నారు. 2022లో హైదరాబాద్‌ (Hyderabad)నగర విద్యార్థుల నమోదులో 135 శాతం పెరుగుదల కనబరిచిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-01-25T11:04:52+05:30 IST