Posts: 60 వేల శాలరీతో జీజీహెచ్‌ వైఎస్సార్‌ కడపలో ఖాళీలు

ABN , First Publish Date - 2023-03-03T12:29:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్‌) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన

Posts: 60 వేల శాలరీతో జీజీహెచ్‌ వైఎస్సార్‌ కడపలో ఖాళీలు
జీజీహెచ్‌ వైఎస్సార్‌ కడపలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్‌) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు: డాక్టర్‌, ఈసీజీ టెక్నీషియన్‌, ఈఈజీ టెక్నీషియన్‌, మార్చురీ అటెండెంట్‌, వార్డ్‌బాయ్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ మొదలైనవి.

అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిది/ పది/ ఇంటర్మీడియెట్‌/ బీఎస్సీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 42 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.11,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక: మొత్తం వంద మార్కులకు ఎంపిక ఉంటుంది. అకడమిక్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుని 75శాతం మార్కులు కేటాయిస్తారు. ఇతర నిబంధనల ప్రకారం మరో 25 శాతం మార్కులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: జీజీహెచ్‌, కడప.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 8

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/ notice_category/recruitment/

Updated Date - 2023-03-03T12:29:26+05:30 IST