UPSC: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్ పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్

ABN , First Publish Date - 2023-05-05T12:15:59+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)... సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను

UPSC: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్ పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్
UPSC Notification

(అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామ్‌ పోస్టుల సంఖ్య: 322

బీఎస్‌ఎఫ్‌-86, సీఆర్‌పీఎఫ్‌-55, సీఐఎస్‌ఎఫ్‌-91, ఐటీబీపీ-60, ఎస్‌ఎస్‌బీ-30

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)... సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో-డిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌, సశస్త్ర సీమా బల్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్ల(గ్రూప్-ఎ) ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 2023 జూలై 1 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(పేపర్‌-1, పేపర్‌-2), ఫిజికల్‌ స్టాండర్డ్స్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 16

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 6

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/

Updated Date - 2023-05-05T12:15:59+05:30 IST