Indian Navyలో ట్రేడ్స్‌మన్‌ స్కిల్డ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2023-02-11T17:05:09+05:30 IST

ఇండియన్‌ నేవీ (Indian Navy) కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్స్‌మన్‌ స్కిల్డ్‌ పోస్టుల (Tradesman Skilled Posts) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Indian Navyలో ట్రేడ్స్‌మన్‌ స్కిల్డ్‌ పోస్టులు
Indian Navyలో

ఖాళీలు 248

ఇండియన్‌ నేవీ (Indian Navy) కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్స్‌మన్‌ స్కిల్డ్‌ పోస్టుల (Tradesman Skilled Posts) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

నేవీ డిపోలు: నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో (ముంబయి), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో (కార్వార్‌), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో (గోవా), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(విశాఖపట్నం),నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(రాంబిలి), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(సునాబెడ)

ట్రేడులు: మెషినిస్ట్‌, డ్రైవర్‌ క్రేన్‌ మొబైల్‌, షిప్‌ రైట్‌, పెయింటర్‌, ఫిట్టర్‌ ఆర్మమెంట్‌, ఫిట్టర్‌ జనరల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ ఎలక్ట్రానిక్‌, ఫిట్టర్‌ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రిక్‌ ఫిట్టర్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ, అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణ పూర్తి చేసి ఉండాలి.

వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

దరఖాస్తు రుసుము: రూ.205. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 6

వెబ్‌సైట్‌: https://nad.recttindia.in/Home/Home

Updated Date - 2023-02-11T17:05:10+05:30 IST