APCPDCLలో అప్రెంటీస్‌లు భర్తీ.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-04-17T12:19:19+05:30 IST

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ, కార్పొరేట్‌ కార్యాలయం....కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి

APCPDCLలో అప్రెంటీస్‌లు భర్తీ.. ఖాళీలెన్నంటే..!
APCPDCL

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ, కార్పొరేట్‌ కార్యాలయం....కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 30 ఖాళీలు

2. టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: 70 ఖాళీలు

విభాగాలు: ఇంజనీరింగ్‌ డిగ్రీ - ఈఈఈ; డిప్లొమా-డీఈఈఈ

నెలవారీ స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.9000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.8000 చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) 2021-2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: 18 ఏళ్లు నిండి ఉండాలి

అప్రెంటి్‌సషిప్‌ శిక్షణ కాలం: ఏడాది

ఎంపిక: డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్‌: https://www.apcpdcl.in/

Updated Date - 2023-04-17T12:19:19+05:30 IST