Indian navy: టెన్త్ ఉత్తీర్ణతతో ఇండియన్‌ నేవీలో పోస్టులు

ABN , First Publish Date - 2023-05-27T17:49:58+05:30 IST

భారత నౌకాదళంలో అగ్నివీర్‌(ఎంఆర్‌) ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం

Indian navy: టెన్త్ ఉత్తీర్ణతతో ఇండియన్‌ నేవీలో పోస్టులు
Indian navy

భారత నౌకాదళంలో అగ్నివీర్‌(ఎంఆర్‌) ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2023(నవంబరు 23) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు: అగ్నివీర్‌(మెట్రిక్‌ రిక్రూట్‌-ఎంఆర్‌): 100 ఖాళీలు(పురుషులు-80, మహిళలు-20)

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2002 నవంబరు 1 - 2005 ఏప్రిల్‌ 31 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష(పీఎ్‌ఫటీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబరులో కోర్సు శిక్షణ ప్రారంభం అవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరవాత సంబంధిత విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: ప్రశ్న పత్రం హిందీ/ఇంగ్లీష్‌ భాషల్లో ఉంటుంది. మొత్తం 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 మార్కులు కేటాయించారు. సైన్స్‌, మేథమెటిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో ఉంది. తప్పుగా గుర్తించిన నాలుగు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.550

దరఖాస్తు: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: మే 29

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్‌ 15

శిక్షణ ప్రారంభం: 2023 నవంబరు

వెబ్‌సైట్‌: ww-w.joinindiannavy.gov.in/

Updated Date - 2023-05-27T17:49:58+05:30 IST