56 వేలకు పైగా జీతంతో ఇండియన్‌ నేవీలో పోస్టులు

ABN , First Publish Date - 2023-05-05T12:31:10+05:30 IST

ఎజిమల (ఐఎన్‌ఏ)లోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ)లో 2024, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్‌ సర్వీస్‌

56 వేలకు పైగా జీతంతో ఇండియన్‌ నేవీలో పోస్టులు
Indian Navy

మొత్తం ఖాళీల సంఖ్య: 242

ఎజిమల (ఐఎన్‌ఏ)లోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ)లో 2024, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

కోర్సు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ - జనవరి 2024

బ్రాంచి వివరాలు

1. జనరల్‌ సర్వీస్‌: 50 పోస్టులు

2. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 10

3. నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 20

4. పైలెట్‌: 25 5. లాజిస్టిక్స్‌: 30

6. నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కేడర్‌: 15

7. ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌): 12

8. ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌): 20

9. ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌): 60

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు నిర్ధిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వేతనం: నెలకు రూ.56,100, ఇతర అలవెన్సులు

ఎంపిక విధానం: అకడమిక్‌ స్కోరు, ఇంటర్వ్యూ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 14

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

Updated Date - 2023-05-05T12:31:10+05:30 IST