Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పోస్టులు

ABN , First Publish Date - 2023-07-03T14:11:20+05:30 IST

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) 2024-25 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసె్‌స(సీఆర్‌పీ)-13 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తారు. నాలుగు వేలకు పైగా ఖాళీలున్నాయి.

Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పోస్టులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) 2024-25 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసె్‌స(సీఆర్‌పీ)-13 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తారు. నాలుగు వేలకు పైగా ఖాళీలున్నాయి.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్‌, రెండోది 200 మార్కులకు మెయిన్స్‌. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్‌ రాసే అవకాశం ఉంటుంది.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: జూలై 21

ప్రిలిమినరీ పరీక్ష: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరులో ఉంటుంది.

మెయిన్స్‌ పరీక్ష: 2023 అక్టోబరులో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.ngri.res.in/

Updated Date - 2023-07-03T14:11:20+05:30 IST