Job fair: 25న ‘అవతార్’ ఉమన్ వర్చువల్ జాబ్ ఫెయిర్
ABN , First Publish Date - 2023-02-22T13:25:17+05:30 IST
మై అవతార్.కామ్ ప్రత్యేకించి మహిళల (Womens) కోసం వర్చువల్ జాబ్ ఫెయిర్‌ని (Job fair) ఫిబ్రవరి 25న నిర్వహిస్తోంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు జాబ్

మై అవతార్.కామ్ ప్రత్యేకించి మహిళల (Womens) కోసం వర్చువల్ జాబ్ ఫెయిర్‌ని (Job fair) ఫిబ్రవరి 25న నిర్వహిస్తోంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు జాబ్ ఫెయిర్ ఉంటుంది. కెరీర్‌లో వేర్వేరు స్థాయుల్లో ఉన్న మహిళల కోసం దీన్ని ఉద్దేశించారు. ఐటీ (IT), హెచ్‌ఆర్ (HR), మార్కెటింగ్ (Marketing), సేల్స్ తదితర రంగాల్లో ఉన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇది నాలుగో ఎడిషన్ కాగా గడచిన మూడింటికి 50కిపైగా కంపెనీలు పాల్గొని పన్నెండు వందలకు పైగా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.
రిజిస్ట్రేషన్ కోసం లింక్: https://www.myavtar.co-m/events/details/14