Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-09-19T09:45:13+05:30 IST

హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ఖాళీలు 65

హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఫ్యాకల్టీ(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)

విభాగాలు: అనస్థీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ అండ్‌ వాస్కులర్‌ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, మెడికల్‌ అంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, పాథాలజీ, పాథాలజీ అంకాలజీ, రుమటాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, యూరాలజీ వాస్కులర్‌ సర్జరీ.

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు

ఎంపిక: అర్హత/అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000. ఇతరులకు రూ.3000.

దరఖాస్తు విధానం: ఆ్‌ఫలైన్‌ దరఖాస్తులను ద ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, రెండో అంతస్తు, ఓల్డ్‌ బ్లాక్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: www.nims.edu.in/

Updated Date - 2023-09-19T09:45:13+05:30 IST