Education Policyలో కొత్త ‘లా’ కోర్సులు

ABN , First Publish Date - 2023-01-28T20:31:14+05:30 IST

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (National Education Policy) (ఎన్‌ఈపీ)ని అనుసరించి యూనివర్సిటీలు మొదలుకుని పేరెన్నికగన్న ఉన్నత విద్యా సంస్థలు సరికొత్త కోర్సులకు

Education Policyలో కొత్త ‘లా’ కోర్సులు
కొత్త ‘లా’ కోర్సులు

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (National Education Policy) (ఎన్‌ఈపీ)ని అనుసరించి యూనివర్సిటీలు మొదలుకుని పేరెన్నికగన్న ఉన్నత విద్యా సంస్థలు సరికొత్త కోర్సులకు శ్రీకారం చుడుతున్నాయి. న్యాయ విద్యా సంస్థలకు సంబంధించి దేశంలోనే టాప్‌ ర్యాంక్‌లో ఉన్న బెంగళూరు (Bangalore) లోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (National Law School of India University) ఈ ఏడాది మొట్టమొదటిసారి మూడేళ్ళ కాలవ్యవధి కలిగిన బీఏ బీఎల్‌ కోర్సును ఆరంభించింది. అదే విధంగా మరికొన్ని ముందడుగు వేశాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence), హ్యూమన్‌ రైట్స్‌ సర్టిఫికెట్‌ కోర్సు (Human Rights Certificate Course)లతో మొదలుపెట్టి డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లను వేర్వేరు అర్హతలు ఉన్న వారికి అందించేందుకు ముందుకు వచ్చాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, హైబ్రిడ్‌ మోడ్స్‌లో ఈ కోర్సులను అందించడం మరో విశేషం. కొన్ని ప్రఖ్యాత సంస్థలు అవి అందించే కోర్సులు ఇలా ఉన్నాయి.

ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)

బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా (National Law School of India) ఆఫర్‌ చేస్తున్న ఈ కోర్సు కాలవ్యవధి మూడేళ్ళు. ఏ డిసిప్లిన్‌లో అయినా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సు చేయవచ్చు. మొదటి సారి ఈ సంస్థ మూడేళ్ళ ఆనర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ని అందిస్తోంది. లా తో కలగలిసిన ఎక్స్‌పీరియెన్షల్‌ లెర్నింగ్‌గా దీన్ని ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సుగా మలిచారు.

ఎంబీఏ లా

పంజాబ్‌లోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా (Rajiv Gandhi National University of Law) అందిస్తున్న ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్ళు. కనీసం 55 శాతం(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సు చేయవచ్చు. లీగల్‌, మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీసె్‌సలో ఎక్స్‌పర్టయిజ్‌ కోసం ఈ కోర్సును ఉద్దేశించారు. బిజినె్‌సమన్‌ కోణంలో ఇక్కడ న్యాయశాస్త్రాన్ని అభ్యసించాలి. కార్పొరేట్‌ లాయర్లు, లా ఫర్మ్‌ కన్సల్టెంట్లు, ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లు, బిజినెస్‌ అనలిస్టులకు ఈ కోర్సు చాలాబాగా ఉపయోగపడుతుంది.

ఎంఏ లీగల్‌ స్టడీస్‌

హైదరాబాద్‌లోని మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ అందిస్తున్న ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్ళు. ఉర్దూ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పాసై ఉండాలి. లేదంటే టెన్త్‌, ఇంటర్‌ ఉర్దూ మీడియంలో చదివి ఉండాలి. లేదా మదర్సాలు నిర్వహించే డిగ్రీకి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. హైదరాబాద్‌లోని నల్సార్‌తో కలిసి ఈ కోర్సును నిర్వహిస్తోంది. కాంపిటేటివ్‌ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ఈ కోర్సు తోడ్పడుతుంది. అలాగే ఎన్జీఓల నుంచి సివిల్‌ సొసైటీ సంస్థలు, హెల్త్‌, కార్పొరేషన్లలో ఉద్యోగాలకూ ఉపయోగపడుతుంది.

మూడేళ్ళ ఎల్‌ఎల్‌బీ

హైదరాబాద్‌ (Hyderabad)లోని మహీంద్రా యూనివర్సిటీ దీన్ని ఆఫర్‌ చేస్తోంది. కనీసం అరవై శాతం మార్కులు లేదా అందుకు సమానమైన గ్రేడ్‌తో ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ క్లాట్‌ స్కోర్‌ కూడా ఉండాలి. వివిధ డొమైన్లకు అవసరమైన లీగల్‌ ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దేందుకు దీన్ని ఉద్దేశించారు. కార్పొరేట్‌ లా, బిజినెస్‌ లా, క్రిమినల్‌ లా, ఇంటర్నేషనల్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, సివిల్‌ అండ్‌ టెక్నాలజీ లా, ప్రైవేట్‌ లా, పబ్లిక్‌ లా తదితరాల్లో వీరు ప్రొఫెషనల్స్‌గా ఉంటారు.

గ్రాడ్యుయేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రోగ్రామ్‌

భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ అందిస్తున్న ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్ళు. కనీసం 50 శాతం మార్కులతో బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌)/ బిఏ ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌బీ లేదా ఎకనమిక్స్‌/ ఫైనాన్స్‌/ మేనేజ్‌మెంట్‌/ ఇన్‌సాల్వెన్సీ/ కామర్స్‌లో పీజీ ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ బోర్డు ఆఫ్‌ ఇండియా(ఐబీబీఐ)తో కలిసి కోర్సును అందిస్తోంది. మన దేశంలో ఇలాంటి కోర్సుకు రూపకల్పన ఇదే తొలిసారి. దేశవిదేశాల్లో సాల్వెన్సీ ప్రొఫెషన్‌లోకి అడుగుపెట్టేందుకు అలాగే సదరు కెరీర్‌లో ఎదుగుదలకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఇన్‌-హౌస్‌ కౌన్సెల్స్‌ లేదా అడ్వయిజర్లుగా ఇన్‌సాల్వెన్సీలో స్టేక్‌హోల్డర్లకు అలాగే లిక్విడేషన్‌, బ్యాంక్‌రప్టసీ, టర్న్‌అరౌండ్‌ ప్రక్రియల్లో పనిచేయవచ్చు.

ఒడిషాలోని నేషనల్‌ లా యూనివర్సిటీ నుంచి..

బీఏ(స్పెషలైజేషన్‌) ఇన్‌ లీగల్‌ కౌన్సెలర్స్‌

ఒడిషాలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అందిస్తోంది. ఏడాది తరవాత డిప్లొమా, రెండేళ్ళ తదుపరి అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, మూడేళ్ళూ చదివితే స్పెషలైజేషన్‌ డిగ్రీ ఇస్తారు. ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అర్హులు. ఎన్‌ఈపీ సూచనల మేరకు జాబ్‌ రెడీ కోర్సుగా మల్టిపుల్‌ ఎగ్జిట్స్‌తో ఈ కోర్సును తీర్చిదిద్దారు. బీఏ డిగ్రీలో భాగంగా దీన్ని రూపొందించారు.

బీఏ(స్పెషలైజేషన్‌) ఇన్‌ లీగల్‌ జర్నలిజం

ఒడిషాలోని నేషనల్‌ లా యూనివర్సిటీ ఈ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. దీనికి కాలవ్యవధి, కనీస అర్హత తదితరాలన్నీ పై కోర్సు మాదిరిగానే ఉంటాయి. స్టెనోగ్రఫి, మీడియా ఎథిక్స్‌, మీడియా లా, లా మీడియా అండ్‌ ఫిల్మ్స్‌, రైటింగ్‌, రీసెర్చ్‌ కోర్సులో భాగంగా ఉంటాయి.

బీఏ(స్పెషలైజేషన్‌) ఇన్‌ అడ్వకసీ

దీన్ని కూడా ఒడిషాలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అందిస్తోంది. కాల వ్యవధి, కనీస అర్హత పై కోర్సు మాదిరిగానే ఉంటాయి. అట్టడుగు వర్గాలకు న్యాయ సహాయం అందించేందుకు ఉద్దేశించిన కోర్సు ఇది. ఆర్‌టీఐ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌, లీగల్‌ డ్రాఫ్టింగ్‌, అకౌంటెన్సీ, టాక్సేషన్‌, ఫండింగ్‌ తదితర సబ్జెక్టులు ఉంటాయి.

బీఏ(స్పెషలైజేషన్‌) ఇన్‌ లీగల్‌ ప్రొఫెషన్‌ అసిస్టెంట్స్‌

దీన్ని కూడా ఒడిషాలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అందిస్తోంది. కాల వ్యవధి, కనీస అర్హత పై కోర్సు మాదిరిగానే ఉంటాయి. స్టెనోగ్రఫి, రికార్డ్‌ కీపింగ్‌, డిజిటల్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ కేసెస్‌, కేస్‌ నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌, ఐసీటీ ఇన్‌ జస్టిస్‌ సిస్టమ్స్‌ తదితర సబ్జెక్టులు ఈ కోర్సులో ఉంటాయి.

బీఏ(స్పెషలైజేషన్‌) ఇన్‌ లీగల్‌ ప్రొఫెషన్‌ అసిస్టెంట్స్‌

దీన్ని కూడా ఒడిషాలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అందిస్తోంది. కాల వ్యవధి, కనీస అర్హత పై కోర్సు మాదిరిగానే ఉంటాయి. స్టార్ట్‌ప్సకు సంబంధించిన లీగల్‌ సమస్యలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌, ఫండింగ్‌ ఫర్‌ ఆంత్రప్రెన్యూర్స్‌, సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, న్యూవెంచర్‌ క్రియేషన్‌ విత్‌ బిజినెస్‌ సిమ్యులేషన్‌ తదితర సబ్జెక్టులు ఉంటాయి.

సర్టిఫికెట్‌ కోర్సులు

డీకోడింగ్‌ పోరెన్సిక్స్‌ ఫర్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అందిస్తున్న ఈ కోర్సు కాలవ్యవధి ఆరు వారాలు మాత్రమే. దీన్లో ఎవరైనా చేరవచ్చు. మొనాష్‌ వర్సిటీలోని ఎలియోస్‌ జస్టి్‌సతో కలిసి ఈ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌, లా లో ఇదో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సు. ఫోరెన్సిక్‌ పాథాలజీలో ఉన్న సైంటిఫిక్‌ కాన్సెప్టులు, లైంగిక నేరాల్లో మెడికల్‌ ఎగ్జామినేషన్‌, పంటి గాట్లకు సంబంధించి ఎవిడెన్స్‌, ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ వంటి టాపిక్స్‌ ఉంటాయి. ఎక్స్‌పర్ట్‌ ఎవిడెన్స్‌ ఎగ్జామినేషన్‌లో లీగల్‌ ప్రమాణాలను ఈ కోర్సు చర్చిస్తుంది.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అండ్‌ ద రూల్‌ ఆఫ్‌ లా

యునెస్కో అందిస్తున్న ఈ కోర్సు కూడా అందరికీ ఉద్దేశించింది. ఇది ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉంటుంది. ఎఐ అప్లికేషన్‌ అలాగే రూల్‌ ఆఫ్‌ లా విషయంలో ఎఐ ప్రభావంపై ఇదో ఇంట్రడక్టరీ కోర్సు. జుడీషియల్‌ సిస్టమ్స్‌లో ఎఐ విపరీత అడాప్షన్‌తో కలిగే ప్రమాదాలను అందుకు ఉన్న అవకాశాలను నిలువరిస్తుంది. అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌ అలాగే హ్యూమన్‌ రైట్స్‌, ఎఐ ఎథిక్స్‌, గవర్నెన్స్‌ అంశాల్లో పెరుగుతున్న ఎఐ అడాప్షన్‌లో చోటుచేసుకోబోయే ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తుంది.

మారిటైమ్‌ లా పాలసీస్‌ అండ్‌ ప్రాక్టీసెస్‌

నిర్మా యూనివర్సిటీ అందించే ఈ కోర్సు కాలవ్యవధి 24 వారాలు. కాగా దీన్ని కూడా అందరి కోసం ఉద్దేశించారు. మారిటైమ్‌ పాలసీలు, ప్రాక్టీ్‌సను అర్థం చేసుకునేందుకు అవసరమై సరంజామాను ఈ కోర్సు అందిస్తుంది.

కంపెనీ లా

భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ అందిస్తున్న ఈ కోర్సు కాల వ్యవధి ఆరు వారాలు. కాగా దీన్ని కూడా అందరికీ ఉద్దేశించారు. కంపెనీ లాలోని అన్ని కోణాలను స్పృశిస్తుంది. మన దేశంలోని కంపెనీ ప్రాక్ట్జికల్‌ ఆపరేషన్స్‌కు ప్రాముఖ్యం కల్పించింది. సంబంధిత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ అలాగే కాంప్లియెన్స్‌ రిక్వైర్‌మెంట్స్‌ కోర్సులో భాగంగా ఉంటాయి. వీటన్నింటినీ విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-01-28T20:34:32+05:30 IST