Professor posts: వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌.. 2 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2023-08-04T12:26:47+05:30 IST

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో

Professor posts: వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌.. 2 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశం

3,295 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం... 23న నోటిఫికేషన్‌..

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 51వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. యూనివర్సిటీలు, ఆర్జీయూకేటీల్లో అధ్యాపకుల నియామకాలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు వివరించగా మొత్తం భర్తీ చేయాలని ఆదేశించారు. ఆర్జీయూకేటీల్లో మరో 660 టీచింగ్‌ పోస్టులు కూడా భర్తీ చేయాలన్నారు. కాగా, వర్సిటీల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 23న నోటిఫికేషన్‌ విడుదల చేసి, సెప్టెంబరు 3, 4వారాల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అక్టోబరు 10 నాటికి ఫలితాలు విడుదల చేసి.. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. నవంబరు 15నాటికి భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

Updated Date - 2023-08-04T12:26:47+05:30 IST