షాకింగ్.. పోలీసులు పిలవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. వారి ఎదుటే ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2023-01-23T15:28:33+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఝాన్సీ జిల్లాలో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. షాకైన పోలీసులు అతడిని వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. దొంగతనం కేసులో ఆ యువకుడి పేరు నమోదైంది.

షాకింగ్.. పోలీసులు పిలవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. వారి ఎదుటే ఎంత పని చేశాడంటే..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఝాన్సీ జిల్లాలో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. షాకైన పోలీసులు అతడిని వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. దొంగతనం కేసులో ఆ యువకుడి పేరు నమోదైంది. పోలీసులు అతడిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. అవమానం తట్టుకోలేకపోయిన యువకుడు స్టేషన్ ముందే ఆత్మహత్యా యత్నం చేశాడు (Crime News).

స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారం.. చివరకు..

ఝాన్సీ జిల్లాలోని బిజ్నా గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లాడు. జనవరి 18వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఆయన ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. సుమారు 80 వేల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వినోద్ జనవరి 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన పుష్పేంద్ర (24) అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు పుష్పేంద్రను విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు.

జీవన్, అంకిత్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంటరాగేషన్ ప్రారంభం కాకముందే స్టేషన్ బయట ఉన్న బాత్‌రూమ్‌కి వెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసుకున్నాడు (Youth slit his throat in front of police station). వెంటనే స్పందించిన పోలీసులు పుష్పేంద్రను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

Updated Date - 2023-01-23T16:04:03+05:30 IST