స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారం.. చివరకు..

ABN , First Publish Date - 2023-01-22T20:55:04+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్ స్నేహాల (Instagram Friendship) వల్ల ఎన్ని అనర్థాలు తలెత్తుతున్నాయో బయటపడుతున్నా కొందరు యువతులు జాగ్రత్త పడడం లేదు. ముక్కూ మొహం తెలియని ఆన్‌లైన్ స్నేహాలను నమ్ముకుని మోసపోతున్నారు.

స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారం.. చివరకు..

ఇన్‌స్టాగ్రామ్ స్నేహాల (Instagram Friendship) వల్ల ఎన్ని అనర్థాలు తలెత్తుతున్నాయో బయటపడుతున్నా కొందరు యువతులు జాగ్రత్త పడడం లేదు. ముక్కూ మొహం తెలియని ఆన్‌లైన్ స్నేహాలను నమ్ముకుని మోసపోతున్నారు. తాజాగా ఢిల్లీకి (Delhi) చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన స్నేహితుడిని నమ్మి అతను చెప్పిన చోటుకు వెళ్లింది. అక్కడ ఆ యువతిపై ఆ స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఎదురు తిరగడంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు (Crime News).

ఢిల్లీలో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువతికి ఆరు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జైపూర్‌కు చెందిన రషీద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా పెరిగింది. మొబైల్ నెంబర్లు మార్చుకుని గంటల తరబడి మాట్లాడుకునే వారు. పరిచయమైన నెల రోజుల్లోనే రషీద్ ఆమెను ఓ కెఫేకు ఆహ్వానించాడు. ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ కదా అనే ఉద్దేశంతో ఆ యువతి అక్కడకు వెళ్లిపోయింది. అక్కడ ఆమెపై రషీద్ అత్యాచారం చేశాడు. యువతి ఎదురు తిరగడంతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.

రషీద్ పెళ్లి చేసుకుంటాననడంతో ఆ యువతి పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడల్లా బాధిత యువతిపై రషీద్ అత్యాచారానికి పాల్పడేవాడు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేస్తుండడంతో నిందితుడు అసలు విషయం చెప్పాడు. పెళ్లికి నిరాకరించాడు. యువతి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. తనను మోసం చేశాడని తెలుసుకున్న బాధితురాలు నిందితుడిపై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-01-22T20:55:04+05:30 IST