సీక్రెట్‌గా పోలీసులకు ఓ యువతి ఫోన్.. మా ఊళ్లో ఓ అబ్బాయిని చెట్టుకు కట్టేసి చచ్చేలా కొడుతున్నారంటూ సమాచారం.. వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2023-02-24T15:44:14+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోరఖ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామస్తులు అనుమానంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు తానే తప్పూ చేయలేదని వేడుకున్నా గ్రామస్థులు కనికరించలేదు.

సీక్రెట్‌గా పోలీసులకు ఓ యువతి ఫోన్.. మా ఊళ్లో ఓ అబ్బాయిని చెట్టుకు కట్టేసి చచ్చేలా కొడుతున్నారంటూ సమాచారం.. వెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోరఖ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామస్తులు అనుమానంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు తానే తప్పూ చేయలేదని వేడుకున్నా గ్రామస్థులు కనికరించలేదు. రెండు గంటల పాటు ఆ యువకుడిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు.ఆ యువకుడి తల, మొహం నుంచి తీవ్రంగా రక్తం కారుతున్నా వదల్లేదు. చివరకు ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు (Crime News).

ఆర్మీ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడు నిబర్హర్ గ్రామం సమీపంలో రన్నింగ్ చేస్తున్నాడు. రాత్రి సమయంలో ఒంటరిగా పరిగెడుతున్న ఆ యువకుడిని చూసి గ్రామస్తులకు అనుమానం మొదలైంది. అతడిని పట్టుకుని ప్రశ్నించారు. గ్రామానికి చెందిన అమ్మాయి కోసం వచ్చినట్టు అనుమానించి చెట్టుకు కట్టేసి గంటల తరబడి కొట్టారు (Villagers beats a young man). ఇంతలో గ్రామానికి చెందిన ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని జనం నుంచి రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

షాపుల్లో కొనే పాలు సేఫ్ అని అనుకుంటున్నారా...? ఈ వార్త చదివితే మార్కెట్లో పాలు కొనడానికి కూడా భయపడతారేమో..!

విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్సం అనంతరం ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొట్టిన జ్వాలా యాదవ్, రామసముజ్, రంజిత్, ఇతరుల పేర్లు చెప్పాడు. వారిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అందరినీ త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

Updated Date - 2023-02-24T16:14:11+05:30 IST