Crime News: వాళ్లిద్దరి చావుకు మద్యం కారణం కాదు.. పోస్ట్‌మార్టం రిపోర్టులో బయటపడిన నిజాలు చూసి పోలీసులకు షాక్..!

ABN , First Publish Date - 2023-05-22T17:19:44+05:30 IST

సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. అయినా కూడా లెక్క చేయకుండా కాలుస్తూనే ఉంటారు. అలాగే మద్యం కూడా ఆరోగ్యానికి హానికరం అని కూడా తెలుసు. అయినా మందు ప్రియులు తాగుతూనే ఉంటారు. ఆ అలవాటు ఉన్న వాళ్లు

Crime News: వాళ్లిద్దరి చావుకు మద్యం కారణం కాదు.. పోస్ట్‌మార్టం రిపోర్టులో బయటపడిన నిజాలు చూసి పోలీసులకు షాక్..!
Crime News

సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. అయినా కూడా లెక్క చేయకుండా కాలుస్తూనే ఉంటారు. అలాగే మద్యం కూడా ఆరోగ్యానికి హానికరం అని కూడా తెలుసు. అయినా మందు ప్రియులు తాగుతూనే ఉంటారు. ఆ అలవాటు ఉన్న వాళ్లు దాన్ని మానుకోలేరు. అందుకే జనాల వీక్‌నెస్‌ను ప్రభుత్వాలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా మద్యం మీద వచ్చే ఆదాయంతోనే నడుస్తుంటాయి. అంటే ఎంతగా లిక్కర్ సేల్ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఆదాయం వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఎందుకు? అని ప్రభుత్వాలే మద్యం షాపులు నడపడం మనం చూస్తూనే ఉన్నాం.

నకిలీ మద్యం.. కల్తీ కల్లు వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. సంఘటనలు ఎన్నో చూశాం. విన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న ఏదొక రకంగా నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతూనే ఉంటారు.

అది తమిళనాడు ప్రభుత్వ (tamil nadu) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైన్ షాపు. అక్కడే ఇద్దరు వ్యక్తులు మద్యం కొనుగోలు చేపి సేవించారు. కానీ వారు ప్రాణాలు కోల్పోయారు (Two people died). మృతుల కుటుంబ సభ్యులంతా కల్తీ మద్యం వల్లే చనిపోయారంటూ ఆగ్రహంతో గ్రామస్తులంతా షాపుపై దాడి చేసి ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుని షాపును సీజ్ చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన నిజాలు వెలుగు చూశాయి. వారిద్దరు చనిపోయింది మద్యం (alcohol) తాగడం వల్ల కాదని, మద్యంలో సైనైడ్ కలపడంతోనే వారిద్దరూ చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. దీంతో ఇది ప్రమాదం కాదని.. పక్కా ప్లాన్‌తో చంపినట్లుగా నిర్ధారణకు వచ్చారు. మద్యంలో అసలు సైనైడ్ కలిపింది ఎవరు? ఇద్దరిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? అని ఆరా తీస్తున్నారు. విచారణను వేగవంతం చేసి వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Crime News: 16 ఏళ్ల బాలిక అతి తెలివి మామూలుగా లేదుగా.. ఒక్క మెసేజ్‌తో కోటి రూపాయలు సంపాదించాలనుకుంది.. కానీ..!

ఇది కూడా చదవండి: Viral News: మాజీ ప్రియుడి నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిందో మెసేజ్.. అంతా చదివిన ఆ ప్రేయసికి మైండ్‌బ్లాక్.. అతడేం అడిగాడంటే..!

Updated Date - 2023-05-22T17:19:44+05:30 IST