పెళ్లైన కొద్ది రోజులకే యువతి మృతి.. భర్తే కారణం అనుకున్నారు.. అసలు విషయం బయటపడడంతో షాక్..

ABN , First Publish Date - 2023-03-10T16:19:53+05:30 IST

ఆ యువతికి కొత్తగా వివాహం జరిగింది.. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని అందరూ అనుకున్నారు.

పెళ్లైన కొద్ది రోజులకే యువతి మృతి.. భర్తే కారణం అనుకున్నారు.. అసలు విషయం బయటపడడంతో షాక్..

ఆ యువతికి కొత్తగా వివాహం జరిగింది.. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని అందరూ అనుకున్నారు.. వాళ్ల మీదే కేసు పెట్టారు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయం తెర మీదకు వచ్చింది.. పెళ్లికి ముందు ఆ యువతి ప్రేమించిన యువకుడే ఆమె చావుకు కారణమయ్యాడని తెలిసి అందరూ షాకయ్యారు.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh News) సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది (Crime News).

సాగర్‌ జిల్లాలోని చాంద్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి 2020 నవంబర్ 25న వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. భర్తను, అత్తమామలను అనుమానించి వారిని విచారించారు. అయితే విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. మృతురాలు పెళ్లికి ముందు నుంచి ప్రమోద్ అహిర్వార్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండేదని తేలింది (Love Affair). దీంతో పోలీసులు అతడిని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మందు బాటిల్‌ను చూసి.. చోరీ చేయడం మర్చిపోయిన దొంగ.. ఫూటుగా మద్యం తాగాడు.. మెలకువ వచ్చాక చూస్తే..

పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ప్రమోద్ ఎట్టకేలకు నిజం అంగీకరించాడు. తన వేధింపుల కారణంగానే మృతురాలు మరణించినట్టు ఒప్పుకున్నాడు (Newly married woman had committed suicide) భర్తను వదిలేసి తనతో పాటు వచ్చెయ్యాలని, లేకపోతే అత్తింటి వారందరినీ చంపేస్తానని బెదిరించానని తెలిపాడు. ఆమె మరణించే రోజు ఉదయం కూడా ఆమెను వేధించానని, సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-03-10T16:25:30+05:30 IST