మందు బాటిల్‌ను చూసి.. చోరీ చేయడం మర్చిపోయిన దొంగ.. ఫూటుగా మద్యం తాగాడు.. మెలకువ వచ్చాక చూస్తే..

ABN , First Publish Date - 2023-03-08T17:47:45+05:30 IST

సినిమాల్లో కొన్ని కామెడీ దొంగతనాల సీన్లు చూస్తూ ఉంటాం. దొంగతనం చేయడానికి వెళ్లిన వారు ఇంట్లో ఉన్న ఆహారం తినడమో, మద్యం సేవించడమో చేసి యజమానులకు దొరికిపోతుంటారు.

మందు బాటిల్‌ను చూసి.. చోరీ చేయడం మర్చిపోయిన దొంగ.. ఫూటుగా మద్యం తాగాడు.. మెలకువ వచ్చాక చూస్తే..

సినిమాల్లో కొన్ని కామెడీ దొంగతనాల సీన్లు చూస్తూ ఉంటాం. దొంగతనం చేయడానికి వెళ్లిన వారు ఇంట్లో ఉన్న ఆహారం తినడమో, మద్యం సేవించడమో చేసి యజమానులకు దొరికిపోతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఓ ఊరిలో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లిన దొంగ అక్కడ ఉన్న మందుబాటిల్‌ను చూసి టెంప్ట్ అయ్యాడు. ఫూటుగా మద్యం సేవించి అక్కడే పడుక్కున్నాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు (Crime News).

యూపీలోని సినౌలీ గ్రామానికి చెందిన ప్రియాంక్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి (Theft) వెళ్లాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో అతడికి ఓ మద్యం బాటిల్ (Liquor Bottle) కనిపించింది. దీంతో తను వచ్చిన పని మర్చిపోయి ఆ సీసా మొత్తం ఖాళీ చేసేశాడు. మత్తులో కూరుకుపోయి అక్కడే నిద్రపోయాడు. తర్వాతి రోజు ఉదయం మెలకువ వచ్చి చూసే సరికి తెల్లారిపోయింది. గోడ దూకి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించాడు.

నెలకు రూ.1.50 లక్షలు సంపాదిస్తున్న గృహిణి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌ నుంచి తీసేశారు.. భర్త, పిల్లలతో సహా సొంతూరికి తిరిగొచ్చాక..

చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-03-08T17:47:45+05:30 IST