భర్త నుంచి వెళ్లిపోయిన భార్య.. 5 ఏళ్ల తర్వాత అంబులెన్సులో శవంగా రాక.. చెవుల్లోంచి రక్తం రావడంతో అతడికి డౌట్.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-20T15:34:11+05:30 IST

ఆ మహిళకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.. భర్తతో రెండేళ్లు కాపురం చేసి ఓ బిడ్డకు తల్లి కూడా అయింది.. ఐదేళ్ల క్రితం వేరే వ్యక్తితో ప్రేమలో పడి అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తను, బిడ్డను వదిలేసి అతడితో వెళ్లిపోయింది.. ఐదేళ్ల తర్వాత ..

భర్త నుంచి వెళ్లిపోయిన భార్య.. 5 ఏళ్ల తర్వాత అంబులెన్సులో శవంగా రాక.. చెవుల్లోంచి రక్తం రావడంతో అతడికి డౌట్.. చివరకు..

ఆ మహిళకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.. భర్తతో రెండేళ్లు కాపురం చేసి ఓ బిడ్డకు తల్లి కూడా అయింది.. ఐదేళ్ల క్రితం వేరే వ్యక్తితో ప్రేమలో పడి అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తను, బిడ్డను వదిలేసి అతడితో వెళ్లిపోయింది.. ఐదేళ్ల తర్వాత విగత జీవిగా ఇంటికి తిరిగి వచ్చింది.. ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రియుడు చెప్పాడు.. అయితే ఆమె చెవుల్లోంచి రక్తం రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. విచారణలో అసలు విషయం బయటపడింది (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గ్వాలియర్‌లోని షీల్‌నగర్‌కు చెందిన రీనా బదౌరియా (35) అనే మహిళ గత 5 సంవత్సరాలుగా భర్త దశరథ్ సింగ్‌కు దూరంగా ఉంటోంది. సురేంద్ర ధాకడ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకుని భర్తను, ఒక్కగానొక్క కొడుకుని వదిలేసి అతడితో వెళ్లిపోయింది. ఐదేళ్లుగా అతడితోనే కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రీనా ఉరేసుకుందని, మృతదేహం అంబులెన్స్‌లో వస్తోందని భర్త దశరథ్ సింగ్‌కు సురేంద్ర ఫోన్ చేసి చెప్పాడు. అంబులెన్స్‌లో రీనా మృతదేహాన్ని చూడగా ఆమె చెవుల నుంచి రక్తం కారినట్టు ఆనవాళ్లు కనిపించాయి. దశరథ్ సింగ్‌కు అనుమానం వచ్చి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేసిన మహిళ.. భర్త ఎదురుగానే ఆమె చెప్పింది విని పోలీసులు షాక్!

పోలీసులు సురేంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ముందు బుకాయించిన సురేంద్ర ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. భర్తను వదిలి తనతో వచ్చేసిన రీనా ఏడాది క్రితం వేరే వ్యక్తితో ప్రేమలో పడిందని (Love Affair), తనకు తెలియకుండా అతడిని కలుస్తూ ఉండేదని చెప్పాడు. శనివారం రాత్రి కూడా అతడిని కలిసిందని, ఆ విషయమై తమ మధ్య గొడవ జరిగిందని, ఆగ్రహంలో ఆమెను హత్య చేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-02-20T15:34:13+05:30 IST