ఇంతకు మించిన శాడిస్ట్ ఉండడేమో.. బ్యాంకు పని చెప్పి ఆ మహిళ ఇంటికెళ్లి ఎంతగా వేధించాడంటే..

ABN , First Publish Date - 2023-02-05T15:29:38+05:30 IST

జైపూర్‌కు (Jaipur) చెందిన ఓ వ్యక్తి ఒంటరి మహిళను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు.. అతడు ఆమెకు ఎలా దగ్గరయ్యాడో, ఆ తర్వాత ఏం చేశాడో తెలుసుకుంటే మాత్రం అతడిని మించి శాడిస్ట్ ఉండడేమో అనిపిస్తుంది..

ఇంతకు మించిన శాడిస్ట్ ఉండడేమో.. బ్యాంకు పని చెప్పి ఆ మహిళ ఇంటికెళ్లి ఎంతగా వేధించాడంటే..

జైపూర్‌కు (Jaipur) చెందిన ఓ వ్యక్తి ఒంటరి మహిళను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు.. అతడు ఆమెకు ఎలా దగ్గరయ్యాడో, ఆ తర్వాత ఏం చేశాడో తెలుసుకుంటే మాత్రం అతడిని మించి శాడిస్ట్ ఉండడేమో అనిపిస్తుంది.. అతడి తీరుతో విసిగిపోయిన మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు (Rajasthan Crime News).

మహేష్ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ బ్యాంకు పని నిమిత్తం తనకు తెలిసిన దీపక్ ఝలానీ అనే మధ్యవర్తిని సంప్రదించింది. అతడు సంబంధిత పత్రాల కోసం ఇంటికి వస్తానంటే సరే అంది. ఫ్లాట్‌కు వెళ్లిన దీపక్ ఒంటరిగా ఉన్న బాధితురాలిపై కన్నేశాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు (Sexual Harassment). ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఆమె నుంచి సర్వం దోచుకున్నాడు. శారీరకంగా, మానసికంగా హింసించాడు.

ఇంటికి పిలిచి తాళి కట్టాడు.. పెళ్లి అయినట్టే అని ఆ మైనర్లు ఇద్దరూ ఏం చేశారంటే.. చివరకు..

ఆ వీడియోను (Pornographic Video) తన దగ్గర ఉంచుకుని వీలైనప్పుడల్లా ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆమెను బెదిరించి రూ.3.50 లక్షల నగదు, బంగారు నగలు లాక్కున్నాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. వీడియో వైరల్ చేస్తానని బెదిరించేవాడు (Blackmail). చివరకు ఆమె ఉంటున్న ఇంటి మీద కన్నేశాడు. ఆ ఇంటిని తన పేరు మీదకు మార్చాలని పట్టుబట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం సాయంత్రం నిందితుడు దీపక్‌ను అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-02-05T15:29:39+05:30 IST