భర్త వద్దంటున్నా ప్రియుడితో రొమాన్స్.. భార్య ప్రియుడిని సహాయం కోసం పిలిచిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2023-01-23T16:19:54+05:30 IST

ఆ వ్యక్తి ఘజియాబాద్‌లో రిక్షా పుల్లర్. పదేళ్ల క్రితం అతడి భార్య మరణించడంతో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.. ఆమె ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తకు తెలిసినా ఆమె భయపడలేదు.. భర్త పలుసార్లు హెచ్చరించినా ఆమె తన తీరు మార్చుకోలేదు..

భర్త వద్దంటున్నా ప్రియుడితో రొమాన్స్.. భార్య ప్రియుడిని సహాయం కోసం పిలిచిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే..!

ఆ వ్యక్తి ఘజియాబాద్‌లో రిక్షా పుల్లర్. పదేళ్ల క్రితం అతడి భార్య మరణించడంతో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.. ఆమె ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తకు తెలిసినా ఆమె భయపడలేదు.. ప్రియుడిని కలిసి రొమాన్స్ సాగించేది.. భర్త పలుసార్లు హెచ్చరించినా ఆమె తన తీరు మార్చుకోలేదు.. చివరకు ఆ వ్యక్తి భార్య ప్రియుడిని సహాయం కోసం అని పిలిచి అత్యంత కిరాతకంగా చంపాడు.. అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి రెండు కవర్లలో ప్యాక్ చేసి చెత్త కుప్ప దగ్గర పారేశాడు.. ఘజియాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది (Crime News).

షాకింగ్.. పోలీసులు పిలవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. వారి ఎదుటే ఎంత పని చేశాడంటే..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌కు చెందిన రిక్లా పుల్లర్ మీలాల్ తన భార్య పూనమ్‌తో కలిసి నివసిస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూనమ్ 26 ఏళ్ల అక్షయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది (Extra Marital Affair). ఇద్దరి గురించి మీలాల్‌కు తెలియడంతో, అతను తన భార్యను హెచ్చరించాడు. కానీ పూనమ్ మాత్రం భర్త మాటలు వినకుండా అక్షయ్‌తో సంబంధాన్ని కొనసాగించింది. అతడితో రహస్యంగా మాట్లాడేది. విషయం తెలుసుకున్న మీలాల్.. అక్షయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అక్షయ్‌తో మాట్లాడాలని చెప్పి భార్యను నమ్మించాడు. దీంతో ఇంటికి రావాల్సిందిగా అక్షయ్‌కు పూనమ్ ఫోన్ చేసింది.

పూనమ్ పిలవడంతో అక్షయ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరితో మీలాల్ ప్రేమగా మాట్లాడాడు. కూతురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పి భార్యను, కూతుర్ని మీలాల్ హాస్పిటల్‌కు పంపించాడు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న అక్షయ్‌ను గొడ్డలితో నరికేశాడు (Man Kills wife's boyfriend) . అతడి శరీర భాగాలను కోసేసి రెండు కవర్లలో ప్యాక్ చేసి చెత్త కుప్ప దగ్గర పారేశాడు. అక్షయ్ కనిపించకపోవడంతో పూనమ్‌కు అనుమానం వచ్చింది. అదే సమయంలో ప్లాస్టిక్ కవర్లలో అక్షయ్ శరీర భాగాలు లభించాయి. దీంతో పూనమ్ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల ఎదుట మీలాల్ నేరం అంగీకరించడంతో అతడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-01-23T16:19:54+05:30 IST