Hyderabad: అత్యాశకు పోయి రూ.లక్ష పోగొట్టుకున్నాడు..ఎలా అంటే..

ABN , First Publish Date - 2023-03-11T15:47:05+05:30 IST

ఓ మోసగాడిని(Cheater) నమ్మి అత్యాశకు పోయి లక్ష పోగోట్టుకున్నాడు ఓ వ్యక్తి..తన వద్ద బంగారు కడ్డీ ఉందని..

Hyderabad: అత్యాశకు పోయి రూ.లక్ష పోగొట్టుకున్నాడు..ఎలా అంటే..

సరూర్‌నగర్‌(ఆంధ్రజ్యోతి): ఓ మోసగాడిని(Cheater) నమ్మి అత్యాశకు పోయి లక్ష పోగోట్టుకున్నాడు ఓ వ్యక్తి..తన వద్ద బంగారు కడ్డీ ఉందని, డబ్బు అవసరం పడటంతో తక్కువ ధరకు ఇచ్చేస్తున్నానని చెప్పడంతో బుట్టలో పడ్డాడు..తక్కువ ధరకే బంగారం(Gold) వస్తుంది కదా అని లక్షరూపాయలు మోసగాడికి ముట్టజెప్పాడు. నిజం తెలుసుకొని లబోదిబోమన్నాడు.

తక్కువ ధరకే ఇచ్చేస్తానంటూ నకిలీ బంగారం(fake gold) అంటగట్టి రూ.లక్షతో యువకుడు పరారయ్యాడు. అల్మాస్‌గూడలోని జయశంకర్‌నగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ వద్దకు వచ్చి ‘నా పేరు గణేశ్‌’ అంటూ ఓ యువకుడు పరిచయం చేసుకున్నాడు. తన వద్ద బంగారు కడ్డీ ఉందని, డబ్బు అవసరం పడడంతో తక్కువ ధరకు ఇచ్చేస్తానని చెప్పాడు. కడ్డీలో నుంచి చిన్న ముక్క కట్‌చేసి శ్రీనివాస్‌కు ఇచ్చాడు. అతడు ఆ ముక్కను గోల్డ్‌స్మిత్‌(Gold Smith) వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా అసలు బంగారమే అని చెప్పాడు. దాంతో శ్రీనివాస్‌ మొత్తం కడ్డీని రూ.లక్షకు బేరమాడి తీసుకున్నాడు. మరోసారి గోల్డ్‌స్మిత్‌కు చూపించగా నకిలీదని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2023-03-11T15:47:05+05:30 IST