Hyderabad: యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2023-03-18T12:40:16+05:30 IST

యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష(Imprisonment) విధించింది.

Hyderabad: యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

హైదరాబాద్‌: యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష(Imprisonment) విధించింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన మాదోతు శ్రీకాంత్‌(23) ఓ యువతి(17)తో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను లోబరుచుకున్నాడు. గర్భవతి(pregnant) అయిన విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం (Pocso Act)కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన భువనగిరి ఫోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించింది.

Updated Date - 2023-03-18T12:44:33+05:30 IST