రోడ్డు పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న యువతి.. సడన్‌గా ఆమె పక్కనే ఆగిన కారు.. పట్టపగలే జరిగిందేంటంటే..!

ABN , First Publish Date - 2023-02-06T15:39:07+05:30 IST

నడిరోడ్డు మీద భార్యాభర్తల మధ్య జరిగిన హై వోల్టేజ్ డ్రామా చుట్టుపక్కల వారికి ఆందోళన కలిగించింది.. బీహార్‌లోని (Bihar) ముజఫర్‌పూర్‌లో ఓ యువతి రోడ్డు పక్క నుంచి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తోంది.. ఇంతలో ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది..

రోడ్డు పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న యువతి.. సడన్‌గా ఆమె పక్కనే ఆగిన కారు.. పట్టపగలే జరిగిందేంటంటే..!

నడిరోడ్డు మీద భార్యాభర్తల మధ్య జరిగిన హై వోల్టేజ్ డ్రామా చుట్టుపక్కల వారికి ఆందోళన కలిగించింది.. బీహార్‌లోని (Bihar) ముజఫర్‌పూర్‌లో ఓ యువతి రోడ్డు పక్క నుంచి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తోంది.. ఇంతలో ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది.. అందులో నుంచి ఇద్దరి వ్యక్తులు దిగి ఆమెను బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లిపోయారు.. చుట్టుపక్కల వారు కిడ్నాప్ (Kidnap) జరిగిందేమోనని కంగారు పడ్డారు.. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.

ముజఫర్‌పూర్‌లోని దాదర్ రోడ్డులో ఓ అమ్మాయి బ్లూ జీన్స్, పింక్ కలర్ టీ షర్ట్ వేసుకుని మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెళ్తోంది. అప్పుడు ఓ స్విఫ్ట్ డిజైర్ కారు ఆ అమ్మాయి ముందు ఆగింది. ఆ కారును చూసిన యువతి పరిగెత్తడానికి ప్రయత్నించింది. అయితే ఆ కారు నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు ఆమెను పట్టుకుని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులు షాకయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది (Crime News).

ఇంతకు మించిన శాడిస్ట్ ఉండడేమో.. బ్యాంకు పని చెప్పి ఆ మహిళ ఇంటికెళ్లి ఎంతగా వేధించాడంటే..

అది భార్యాభర్తల మధ్య గొడవ (Dispute between husband and wife) అని పోలీసులు తెలిపారు. భర్తతో గొడవ పెట్టుకున్న భార్యకు కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను కారులో వెంబడించిన భర్త బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఔరాయ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరినీ ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2023-02-06T15:39:09+05:30 IST