ఏయ్‌.. ఎవరు దొంగ. నువ్వే ఒక ఫ్రాడ్‌.. అంటూ..

ABN , First Publish Date - 2023-04-19T10:55:05+05:30 IST

‘ఏయ్‌.. ఎవరు దొంగ. నువ్వే ఒక ఫ్రాడ్‌, మీ పోలీసులంతా ఫ్రాడ్స్‌...’ అంటూ వాహన తనిఖీల్లో ఉన్న ఎస్‌ఐపై ఓ మహిళ

ఏయ్‌.. ఎవరు దొంగ. నువ్వే ఒక ఫ్రాడ్‌.. అంటూ..

అడయార్‌(చెన్నై): ‘ఏయ్‌.. ఎవరు దొంగ. నువ్వే ఒక ఫ్రాడ్‌, మీ పోలీసులంతా ఫ్రాడ్స్‌...’ అంటూ వాహన తనిఖీల్లో ఉన్న ఎస్‌ఐపై ఓ మహిళ పరుష పదజాలంతో దూషించింది. పైగా ఎస్‌ఐపై చేయి చేసుకుంది. మద్యం తాగి వాహనం నడిపితేనే కేసు నమోదు చేయాలి. బండిని తోసుకుంటూ వస్తే కేసు ఎలా నమోదు చేస్తావ్‌.. చట్టం తెలియకుంటే తెలుసుకో అంటూ ఎస్‌ఐపై ఆమె మండిపడింది. ఈ వ్యవహారంపై ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చూలైమేడు పోలీసులు ఆ మహిళతో పాటు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, రెండు రోజుల క్రితం నెల్సన్‌ మాణిక్యం రోడ్డులో చూలైమేడు పోలీస్‏స్టేషన్‌ ఎస్‌ఐ లోహిదర్శన్‌ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మద్యం తాగి తన ద్విచక్రవాహనాన్ని నెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. దీన్ని గమనించిన ఎస్‌ఐ ఆ వ్యక్తిని అపి బైకు పత్రాలు చూపించాలని కోరాడు. డాక్యుమెంట్లన్నీ ఇంట్లోఉన్నాయని సమాధానమిచ్చి, విషయాన్ని తన భార్యకు సమాచారం చేరవేశాడు. దీంతో ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్‌ఐ(SI)ను పరుష పదజాలతో దూషించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వ్యవహారంపై ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చూలై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ మహిళను చూలైమేడుకు చెందిన అక్షయ (32), ఈమె భర్త సత్యరాజ్‌, వీరి స్నేహితుడు వినోద్‌గా గుర్తించారు. పైగా ఆ మహిళ కూడా మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు నిర్ధరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై దాడి, హత్యాయత్నం, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదికూడా చదవండి: సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి

Updated Date - 2023-04-19T10:55:05+05:30 IST