భర్తతో గొడవ.. కొడుకు, భార్య కిడ్నాప్.. కొడుకు ఎదురుగానే కారు వెనుక సీటులో తల్లిపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2023-02-26T15:14:56+05:30 IST

ఆ మహిళ తన భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.. 15 రోజుల క్రితం ఆ మహిళ భర్తకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో ఆ వ్యక్తి పగబట్టాడు..

భర్తతో గొడవ.. కొడుకు, భార్య కిడ్నాప్.. కొడుకు ఎదురుగానే కారు వెనుక సీటులో తల్లిపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత..

ఆ మహిళ తన భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.. 15 రోజుల క్రితం ఆ మహిళ భర్తకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో ఆ వ్యక్తి పగబట్టాడు.. మరో ముగ్గురితో కలిసి ఆ మహిళను, బాలుడిని కిడ్నాప్ చేశాడు.. ఆ మహిళను కారు వెనుక సీట్లోకి తోసి ఒకరి తర్వాత ఒకరు సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు (Crime News).

జైపూర్‌లోని (Jaipur) ఓ కాలనీలో భర్త, కొడుకుతో కలిసి 23 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఫిబ్రవరి 7న పొరుగున నివసించే ఓ వ్యక్తి ఆ మహిళ భర్తతో గొడవ పడ్డాడు. చంపేస్తానని బెదిరించాడు. మరుసటి రోజు నిందితుడిపై శివదాస్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఆ మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు దారుణానికి తెగించాడు. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 9 గంటలకు బాధితురాలు నిర్మాణంలో ఉన్న ఇంటిపై పని చేస్తోంది. ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. నిందితుడు మరో ముగ్గురితో కలిసి అక్కడకు కారులో వచ్చాడు. ఆ మహిళను లాక్కెళ్లి బలవంతంగా కారు వెనుక సీటులోకి తోసేశాడు.

Viral Video: సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యం.. రెండు బైక్‌లు, కుక్క భూమి లోపలికి.. వైరల్ వీడియో

ఆ మహిళ కొడుకు బయట నిలబడి ఉండగా.. నలుగురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు (Sexual Harassment). ఆ ఘటన మొత్తాన్ని వీడియో కూడా తీశారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే అశ్లీల వీడియోలు (Obscene Video) బయట పెట్టి కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు తన భర్తకు మొత్తం వివరించింది. భర్తతో కలిసి వెళ్లి పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నలుగురు నిందితులపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-02-26T15:14:57+05:30 IST