నీతో వేగలేమంటూ నలుగురు భార్యలు పారిపోయారు.. అయిదో భార్య మాత్రం ఆ భర్తనే చంపేసింది.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-03-03T17:20:56+05:30 IST

ఆ వ్యక్తి వయసు 45 ఏళ్లు.. గత నెల 21వ తేదీన గ్రామ శివారులోని రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉన్నాడు.. అతడి శరీరంపై గొడ్డలితో నరికిన గాయాలున్నాయి.. అలాగే అతడి మర్మాంగాన్ని కూడా కోసేశారు..

నీతో వేగలేమంటూ నలుగురు భార్యలు పారిపోయారు.. అయిదో భార్య మాత్రం ఆ భర్తనే చంపేసింది.. అసలేం జరిగిందంటే..!

ఆ వ్యక్తి వయసు 45 ఏళ్లు.. గత నెల 21వ తేదీన గ్రామ శివారులోని రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉన్నాడు.. అతడి శరీరంపై గొడ్డలితో నరికిన గాయాలున్నాయి.. అలాగే అతడి మర్మాంగాన్ని కూడా కోసేశారు.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించి విచారణ ప్రారంభించారు.. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.. శాడిస్ట్ అయిన ఆ వ్యక్తి ఐదో భార్య చేతిలోనే హతమయ్యాడని పోలీసులు బయటపెట్టారు.. ఆమెను అరెస్ట్ చేశారు (Wife killed Husband).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సింగ్రౌలి జిల్లా ఉర్తి గ్రామానికి చెందిన వీరేంద్ర గుర్జార్ అనే వ్యక్తి గత నెల మరణించాడు. అతడికి ఇప్పటివరకు మొత్తం 5 వివాహాలు జరిగాయి. మొదటి భార్య అతడి వేధింపులు తట్టుకోలేక ఏడేళ్ల క్రితం తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో వీరేంద్ర మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో రెండు సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు. తరువాత వారి మధ్య వివాదం ప్రారంభమైంది. వీరేంద్ర మద్యపానం చేసేవాడు. అలాగే ఇతర మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకునేవాడు. దీంతో రెండో భార్య కూడా వెళ్లిపోయింది. తర్వాత వీరేంద్ర చేసుకున్న మూడు, నాలుగో పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఏడాదిన్నర క్రితం కంచన్ అనే యువతిని వీరేంద్ర వివాహం చేసుకున్నాడు (Crime News).

కూతురిపై అత్యాచారం చేస్తానంటే ఏ తండ్రయినా ఊరుకుంటాడా..? అందుకే చంపేశా..?.. ఓ తండ్రి మాటలివీ.. అసలేం జరిగిందంటే..


డ్రగ్స్‌కు, మద్యానికి అలవాటు పడిన వీరేంద్ర.. కంచన్‌ను కూడా చాలా కష్టాలు పెట్టేవాడు. అసహజ శృంగారం చేయాలని (Sexual Harassment), మద్యపానం చేయాలని వేధించేవాడు. మద్యం మత్తులో ఆమె చేత చేయకూడని పనులు చేయించేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన కంచన్ ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 20 నిద్రమాత్రలు కలిపిన పాలు తాగించింది. అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికేసింది. కత్తితో అతడి మర్మాంగాన్ని (Wife cuts husband`s Genital) కోసేసింది. అర్దరాత్రి సమయంలో మృతదేహాన్ని సైకిల్‌పై వేసుకుని ఊరవతల పారేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది.

Updated Date - 2023-03-03T17:20:56+05:30 IST