కూతురిపై అత్యాచారం చేస్తానంటే ఏ తండ్రయినా ఊరుకుంటాడా..? అందుకే చంపేశా..?.. ఓ తండ్రి మాటలివీ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-03T16:57:30+05:30 IST

ఆ వ్యక్తి ఓ లారీ క్లీనర్.. డ్రైవర్‌తో కలిసి నాలుగేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు.. వారాలు, నెలలు అతడితోనే గడిపేవాడు.. అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని వారం రోజుల క్రితం చంపేశాడు..

కూతురిపై అత్యాచారం చేస్తానంటే ఏ తండ్రయినా ఊరుకుంటాడా..? అందుకే చంపేశా..?.. ఓ తండ్రి మాటలివీ.. అసలేం జరిగిందంటే..

ఆ వ్యక్తి ఓ లారీ క్లీనర్.. డ్రైవర్‌తో కలిసి నాలుగేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు.. వారాలు, నెలలు అతడితోనే గడిపేవాడు.. అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని వారం రోజుల క్రితం చంపేశాడు.. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రకరకాల కథలు చెప్పాడు.. చివరకు నిజం అంగీకరించి అసలు విషయం చెప్పేశాడు.. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు.. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన జుల్ఫికర్ అనే ట్రక్ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ట్రక్కు క్లీనర్ సత్యేంద్ర కూడా గాయపడ్డాడు. స్కార్పియోలో వచ్చిన దుండగులు డ్రైవర్‌ను హత్య చేసి, తనను కొట్టి పారిపోయారని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఎక్కడా స్కార్పియో జాడ కనిపించలేదు. దీంతో అనుమానం క్లీనర్‌పైకి మళ్లింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

5వ తరగతి మాత్రమే చదివిన ఈమె ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తోందంటే నమ్మలేకపోతున్నారా..? అసలు ఈమె చేసే పనేంటంటే..

అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చే జుల్ఫికర్ తన కూతురిపై కన్నేశాడని సత్యేంద్ర చెప్పాడు. తన ముందే తన కూతురి గురించి అసభ్యంగా మాట్లాడేవాడని పేర్కొన్నాడు. ఎప్పుడైనా కోపం వస్తే నీ కూతురిని అత్యాచారం చేస్తానని (Sexual Harassment) తిట్టేవాడని, బుధవారం ఉదయం కూడా తన కూతురి గురించి అసభ్యంగా మాట్లాడాడని, అందుకే కోపంలో అతడిని చంపేశానని సత్యేంద్ర తెలిపాడు. ఇనుప రాడ్డుతో జుల్ఫికర్ తలపై కొట్టి చంపేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యేంద్రను అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-03-03T16:57:30+05:30 IST