కేన్సర్‌తో భార్య మృతి.. 10 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ నెల రోజులకే ఆ భర్తకు ఊహించని షాక్..!

ABN , First Publish Date - 2023-02-06T19:07:58+05:30 IST

ఆ వ్యక్తి భార్య కేన్సర్‌తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది.. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.. వారిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.. ఇటీవల అతడికి మరో మహిళ పరిచయమైంది.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. అయితే..

కేన్సర్‌తో భార్య మృతి.. 10 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ నెల రోజులకే ఆ భర్తకు ఊహించని షాక్..!

ఆ వ్యక్తి భార్య కేన్సర్‌తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది.. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.. వారిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.. ఇటీవల అతడికి మరో మహిళ పరిచయమైంది.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. అయితే ఆ వివాహం పట్ల చిన్న కూతురు ఆగ్రహంగా ఉంది.. తండ్రి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సవతి తల్లిపై కత్తితో దాడి చేసింది.. హర్యానాలోని (Haryana) రేవారిలో ఈ ఘటన జరిగింది (Crime News).

రేవారికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి భార్య కేన్సర్‌తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది. నరేంద్రకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి అయింది. చిన్న కూతురు ఇంట్లోనే ఉంటోంది. జనవరి 4న నరేంద్ర.. మల్లిక అనే మహిళను వివాహం చేసుకున్నాడు (Second Marriage). ఈ వివాహం పట్ల నరేంద్ర చిన్న కూతురు ఆగ్రహంతో ఉంది. ఆదివారం ఇంట్లో పని చేస్తున్న మల్లికపై కత్తితో దాడి చేసింది (Girl tried to slit step mother`s throat). మెడపై కత్తితో కోసేసింది.

రెండ్రోజుల్లో పెళ్లి.. నలుగు పెట్టాక బాత్రూంకు వెళ్లిన వధువు.. ఎన్ని సార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..

వెంటనే చుట్టు పక్కల వారు మల్లికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందుకుంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మల్లికపై దాడి చేసిన నరేంద్ర చిన్న కూతురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-02-06T19:08:00+05:30 IST