రెండ్రోజుల్లో పెళ్లి.. నలుగు పెట్టాక బాత్రూంకు వెళ్లిన వధువు.. ఎన్ని సార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..

ABN , First Publish Date - 2023-02-06T15:19:06+05:30 IST

ఆ యువతికి వివాహం నిశ్చయమైంది.. బుధవారం ఉదయం ఆమె పెళ్లి పీటలపై కూర్చోవాల్సి ఉంది.. ఆదివారం సాయంత్రం ఇంట్లో బంధుమిత్రుల మధ్య హల్దీ వేడుక ఘనంగా జరిగింది.. కార్యక్రమం పూర్తయ్యాక ఆమె స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది.. ఎంతసేపటికీ బయటకు రాలేదు..

రెండ్రోజుల్లో పెళ్లి.. నలుగు పెట్టాక బాత్రూంకు వెళ్లిన వధువు.. ఎన్ని సార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..

ఆ యువతికి వివాహం నిశ్చయమైంది.. బుధవారం ఉదయం ఆమె పెళ్లి పీటలపై కూర్చోవాల్సి ఉంది.. ఆదివారం సాయంత్రం ఇంట్లో బంధుమిత్రుల మధ్య హల్దీ వేడుక ఘనంగా జరిగింది.. కార్యక్రమం పూర్తయ్యాక ఆమె స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది.. ఎంతసేపటికీ బయటకు రాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.. లోపల ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది.. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్టు ధ్రువీకరించారు.. దీంతో అప్పటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు విషాదంతో మూగబోయింది (Bride dies before two days of marriage).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌కు చెందిన గీత అనే యువతికి ఈ నెల 7వ తేదీ రాత్రి వివాహం జరగనుంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో బంధుమిత్రుల మధ్య హల్దీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం స్నానం చేసేందుకు గీత బాత్‌రూమ్‌కు వెళ్లింది. సుమారు 45 నిమిషాల పాటు ఆమె బయటకు రాకపోవడంతో ఇంట్లోని మహిళలు బాత్రూమ్ తలుపు తట్టారు. లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా లోపల గీత అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే డాక్టర్‌ని పిలిపించారు. యువతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు (Crime News).

ప్రియురాలితో కలిసి మద్యం సేవించాడు.. ఆమె ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిందని ఎంత పని చేశాడంటే..!

మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పెళ్లి వేడుకలో గీత చాలా సంతోషంగా పాల్గొందని, ఆమెకు పెళ్లి పట్ల ఎలాంటి విముఖతా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, బాత్రూమ్‌లో గీతకు హఠాత్తుగా గుండెపోటు (Heart Attack) వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం ఈ కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-06T15:19:08+05:30 IST