ప్రియురాలితో కలిసి మద్యం సేవించాడు.. ఆమె ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిందని ఎంత పని చేశాడంటే..!

ABN , First Publish Date - 2023-02-05T19:16:01+05:30 IST

ఆ యువకుడు వీకెండ్‌లో తన ప్రియురాలితో సరదాగా గడిపేందుకు నోయిడా (Noida) వెళ్లాడు.. ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆమెతో కలిసి మద్యం సేవించాడు.. అనంతరం ఇద్దరి మధ్య ఓ అమ్మాయి గురించి గొడవ మొదలైంది..

ప్రియురాలితో కలిసి మద్యం సేవించాడు.. ఆమె ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిందని ఎంత పని చేశాడంటే..!

ఆ యువకుడు వీకెండ్‌లో తన ప్రియురాలితో సరదాగా గడిపేందుకు నోయిడా (Noida) వెళ్లాడు.. ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆమెతో కలిసి మద్యం సేవించాడు.. అనంతరం ఇద్దరి మధ్య ఓ అమ్మాయి గురించి గొడవ మొదలైంది.. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు.. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు అపార్ట్‌మెంట్ 20వ అంతస్థు నుంచి దూకి చనిపోయాడు.. అతడు మీద పడడంతో కింద ఉన్న ఓ మహిళ కూడా గాయాల పాలైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు (Crime News).

బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు శుక్రవారం నోయిడా వెళ్లాడు. నేరుగా ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఆ యువకుడి ప్రియురాలితో పాటు మరో యువతి కూడా ఉంది. ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. సాయంత్రం ఐదు గంటలకు ఆ యువతి బయటకు వెళ్లిపోయింది. ఆ యువతిని పిలిచినందుకు తన ప్రియురాలిపై ఆ యువకుడు సీరియస్ అయ్యాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

ఇంతకు మించిన శాడిస్ట్ ఉండడేమో.. బ్యాంకు పని చెప్పి ఆ మహిళ ఇంటికెళ్లి ఎంతగా వేధించాడంటే..

కింద ఉన్న సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేసేందుకు ఆ యువతి కిందకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు అపార్ట్‌మెంట్ 20వ అంతస్థు నుంచి కిందకు దూకేశాడు (Techie jumps from 20th floor of a building). గ్రౌండ్‌ఫ్లోర్‌లో భోజనం చేస్తున్న ఓ మహిళపై పడ్డాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-02-05T19:34:18+05:30 IST