చదివింది ఎనిమిదో తరగతే కానీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.. ప్రేయసిని చంపేసినట్టు నేరం ఒప్పుకున్నాడు కానీ..

ABN , First Publish Date - 2023-02-08T15:56:51+05:30 IST

మీరు దృశ్యం సినిమా (Drishyam Movie) చూశారా? ఆ సినిమాలో హీరో పెద్దగా చదువుకోకపోయినా సినిమా నాలెడ్జ్‌తో పోలీసులను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి దృశ్యం సినిమా చూసి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.

చదివింది ఎనిమిదో తరగతే కానీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.. ప్రేయసిని చంపేసినట్టు నేరం ఒప్పుకున్నాడు కానీ..

మీరు దృశ్యం సినిమా (Drishyam Movie) చూశారా? ఆ సినిమాలో హీరో పెద్దగా చదువుకోకపోయినా సినిమా నాలెడ్జ్‌తో పోలీసులను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి దృశ్యం సినిమా చూసి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. వివాహిత అయిన తన ప్రియురాలిని చంపేసి పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడు.. హత్యకు చాలా రోజుల ముందు, నిందితుడు దృశ్యం సినిమాతో పాటు అనేక ఇతర క్రైమ్ సిరీస్‌లను కూడా చూశాడు. రాజస్థాన్‌లోని (Rajasthan) నాగౌర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నాగౌర్ జిల్లాలోని శ్రీబాలాజీ కాలనీకి చెందిన అనోపరామ్ అనే వ్యక్తి తన పక్కింట్లో నివసించే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకున్నాడు. అనోపరామ్‌ను ఆ మహిళ మనస్ఫూర్తిగా ప్రేమించి అతడితో కలిసి జీవించాలనుకుంది. అనోపరామ్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. అందుకని ప్రియురాలని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను అడవి దగ్గరకు తీసుకెళ్లి నరికేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడి రకరకాల కథలు చెప్పాడు. అడవిలోని బావిలో తన ప్రియురాలి శరీర భాగాలు వేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి అన్వేషణ ప్రారంభించారు (Crime News).

నా భర్తను వదిలేస్తా.. నువ్వూ నీ భార్యను వదిలేయ్.. పెళ్లి చేసుకుందాం.. ప్రేయసి ప్రపోజల్ ఓ రాష్ట్రాన్నే వణికించింది..!

పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఎల్‌ నిపుణులు, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు ఆ బావిలోకి దిగి అన్వేషణ ప్రారంభించారు. 308 అడుగుల ఇరుకైన బావిలోకి దిగి మూడు రోజులుగా వెతుకుతున్నారు. ఎంత వెతికినా నీరు, బురద తప్ప ఆ బావిలో ఇంకేం కనిపించలేదు. అనోపరామ్ రోజుకో విషయం చెబుతుండడంతో పోలీసులు అతడికి నార్కో టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షల కోసం కోర్టు నుంచిఅనుమతి తీసుకున్న తర్వాత నిందితుడిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-08T15:56:53+05:30 IST