Viral Video: ఈ కుర్రాడు బైక్‌ను ఎక్కడా ఆపలేదు.. కానీ బ్యాగులో ఉండాల్సిన రూ.40 లక్షల డబ్బు మాయం..!

ABN , First Publish Date - 2023-03-07T20:47:03+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు రోజుల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు.

Viral Video: ఈ కుర్రాడు బైక్‌ను ఎక్కడా ఆపలేదు.. కానీ బ్యాగులో ఉండాల్సిన రూ.40 లక్షల డబ్బు మాయం..!

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు రోజుల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు ఆకాష్, అభిషేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు 38 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Rs.40 lakhs looted).

ఉమేష్ అనే వ్య‌క్తి తన బ్యాగ్‌లో రూ.40 లక్షలు పెట్టుకుని బైక్‌పై వెళ్తున్నాడు. అయితే రోడ్డుపై రద్దీ వల్ల నెమ్మదిగా ఆగి ఆగి బైక్ నడుపుతున్నాడు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అతడి వెనుక ఉన్న బ్యాగ్ జిప్ తెరిచి డబ్బులు పట్టుకెళ్లిపోయారు. ఆ విషయం ఉమేష్ గమనించలేదు. రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోవడంతో ఆ దోపిడీని వెనుక వాహనదారులు కూడా పట్టించుకోలేదు. ఇంటికెళ్లి బ్యాగ్ చూసుకున్న ఉమేష్ డబ్బులు లేకపోవడంతో షాకయ్యాడు (Robbery in the middle of the road).

Amul's Disclaimer: అమూల్ పాల ఉత్పత్తులపై ఈ రాతలేంటి..? అసలు వీటికి అర్థమేంటి..? నెట్టింట హాట్ టాపిక్..!

వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఎక్కడ, ఎలా పోయాయో చెప్పలేకపోవడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఎర్రకోట సమీపంలో రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు ఉమేష్ బ్యాగ్‌లోని డబ్బులను కాజేసినట్టు తెలుసుకున్నారు. వారిని గుర్తించి ఇద్దరిని పట్టుకున్నారు. మూడో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు (Crime News).

Updated Date - 2023-03-07T20:47:03+05:30 IST