VFS Global: కరోనా పూర్వపు స్థితికి చేరుకున్న వీసా దరఖాస్తులు!

ABN , First Publish Date - 2023-03-28T20:34:39+05:30 IST

వీసా దరఖాస్తుదారుల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా తర్వాత వీసా కోసం దరఖాస్తు

VFS Global: కరోనా పూర్వపు స్థితికి చేరుకున్న వీసా దరఖాస్తులు!

హైదరాబాద్: వీసా దరఖాస్తుదారుల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తగ్గిపోగా, 2022లో మళ్లీ దరఖాస్తులు ఊపందుకున్నాయి. దాదాపు కొవిడ్ ముందునాటి స్థితికి చేరుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దులు తెరవడం, కొవిడ్‌ మార్గదర్శకాలను సరళీకృతం చేయడంతో వీసాలకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. ‘వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌’(VFS Global) ప్రకారం.. వీసా దరఖాస్తుల పరంగా చూస్తే 2022లో కొవిడ్ ముందునాటికి స్థితికి అంటే 2019 నాటి పూర్వపు స్థితికి (95 శాతం) చేరుకుంది. 2021తో పోలిస్తే ఏకంగా 129 శాతం వృద్ధి కనిపించింది.

visa1.jpg

వీసా(Visa) దరఖాస్తుల విషయంలో 2022లో తాము అసాధారణ డిమాండ్‌ చూసినట్టు వీఎఫ్ఎస్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సౌత్ ఆసియా) ప్రబుద్ధ సేన్ అన్నారు. ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ద్వారా చివరి నిమిషం రద్దీని అధిగమించవచ్చన్నారు.

వీసా ఎట్ డోర్ స్టెప్ (Visa At Door Step) కూడా దరఖాస్తులు పెరగడానికి మరో కారణం. ఈ ప్రీమియం ఆప్షనల్ సేవలు తాము కోరుకునే ప్రాంతాల్లోనే వీసాను పొందే అవకాశం కల్పిస్తుంది. గతేడాది ఈ సేవల్లో రెండురెట్ల వృద్ధి కనిపించింది. ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఈస్ట్రోనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగేరీ, ఐస్‌ల్యాండ్‌, ఇటలీ, లుథువేనియా, లగ్జంబర్గ్‌, స్లోవేనియా, స్విట్జర్లాంగ్‌, యూకే వంటి 16 క్లయింట్‌ గవర్నమెంట్స్‌ వీసా ఎట్ డోర్ స్టెప్ సేవలను వీఎఫ్‌ఎస్‌ అందిస్తోంది. షెడ్యూలింగ్ కోసం తాము ఎలాంటి ఫీజునూ వసూలు చేయబోమని, అలా ఎవరైనా చెప్పినా నమ్మవద్దని ప్రబుద్ధ సేన్ అన్నారు.

visa2.jpg

వేగంగా, సురక్షితంగా, వీసా సమర్పణ అనుభవాలను అందించడమే కాకుండా అనుభవజ్ఞులైన సిబ్బంది కేంద్రం వద్ద దరఖాస్తు చేయడంలో సహాయపడతారు. అలాగే, పాస్‌పోర్టు, డాక్యుమెంట్లను వీఎఫ్ఎస్ సురక్షితంగా డెలివరీ చేస్తుంది. అలాగే, ట్రావెల్‌ వైద్య బీమాను కొవిడ్‌-19 కవరేజీతో సహా అంతర్జాతీయ బీమా సంస్థల నుంచి పొందొచ్చు. వీసా దరఖాస్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ రూపంలో లభిస్తుంది.

Updated Date - 2023-03-28T20:34:39+05:30 IST