IncomeTax : రెండువేల నోట్ల డిపాజిట్లపై ఐటీ అధికారుల ఆరా

ABN , First Publish Date - 2023-05-29T13:46:04+05:30 IST

దేశంలో రెండువేల రూపాయల నోట్లను ఉపసంహరణ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా నోట్ల డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల డిపాజిట్లను పర్యవేక్షించేందుకు ఆదాయపు పన్ను అధికారులు సమాయత్తం అయ్యారు....

IncomeTax : రెండువేల నోట్ల డిపాజిట్లపై ఐటీ అధికారుల ఆరా
Tax officials monitor deposits of Rs.2,000 notes

న్యూఢిల్లీ: దేశంలో రెండువేల రూపాయల నోట్లను ఉపసంహరణ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా నోట్ల డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల డిపాజిట్లను పర్యవేక్షించేందుకు ఆదాయపు పన్ను అధికారులు సమాయత్తం అయ్యారు.(₹2,000 notes) భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2,000 నోట్లను ఒక్కో లావాదేవీకి రూ.20,000 వరకు మార్చుకోవడానికి అనుమతించింది.బ్యాంకు శాఖల ద్వారా కరెన్సీ చెస్ట్‌లలో రూ.2,000 నోట్ల డిపాజిట్‌ను పన్ను అధికారులు పరిశీలించే అవకాశాలున్నాయి.(Tax officials)రోజువారీ లావాదేవీల రికార్డును ఉంచాలని ఐటీ అధికారులు బ్యాంకు శాఖలను ఆదేశించారు.

పెద్ద మొత్తంలో నగదు మార్పిడి చేసే ప్రయత్నాలను ఐటీశాఖ సులభంగా ట్రాక్ చేయవచ్చు. 2018-19లో ఆర్‌బిఐ రెండువేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసిన తర్వాత, చలామణిలో లేని వాటిలో ఎక్కువ భాగం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్న డబ్బు అని ఐటీ భావిస్తోంది. పన్ను అధికారులు అనుమానాస్పద లావాదేవీలు, డిపాజిట్లను మాత్రమే పరిశీలిస్తారని ఓ వ్యక్తి చెప్పారు.రియల్ ఎస్టేట్, మైనింగ్, పాన్ మసాలా, గుట్కా ,పొగాకు పరిశ్రమ, బులియన్, కమోడిటీ మార్కెట్లు, సినిమా పరిశ్రమ, విద్యా సంస్థల ఖాతాల్లో రెండువేలరూపాయల నోట్ల డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తుందని అంటున్నారు.

Updated Date - 2023-05-29T13:46:04+05:30 IST