Piaggio: హైదరాబాద్‌లో గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన ‘పియాజియో’

ABN , First Publish Date - 2023-03-19T19:54:30+05:30 IST

రోడ్డు భద్రతపై నగర వాసుల్లో అవగాహన పెంచేందుకు ఇటాలియన్ మోటార్ వెహికల్ మాన్యుఫ్యాక్చరర్ పియాజియో ఇండియా(Piaggio India)

Piaggio: హైదరాబాద్‌లో గ్రాండ్‌  దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన ‘పియాజియో’

హైదరాబాద్: రోడ్డు భద్రతపై నగర వాసుల్లో అవగాహన పెంచేందుకు ఇటాలియన్ మోటార్ వెహికల్ మాన్యుఫ్యాక్చరర్ పియాజియో ఇండియా(Piaggio India) ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్ దక్కన్ రైడ్(Grand Deccan Ride) నిర్వహించింది. 100మందికిపై మహిళా రైడర్లు సహా 300 మంది రైడర్లు ఇందులో పాల్గొన్నారు. నగరంలోని అన్ని పియాజియో షోరూముల వద్ద ప్రారంభమైన రైడ్ వెస్లీ కాలేజీ వద్ద కలిసింది. అక్కడ గ్రాండ్ దక్కన్ రైడ్ అధికారికంగా ప్రారంభమైంది. నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్ల మీదుగా సాగుతూ చివరికి సోమాజీగూడలోని పార్క్ హోటల్ వద్ద ముగిసింది.

పూర్తి సరికొత్తగా పునరుద్ధరించిన ఐ-గెట్ ఇంజిన్ కలిగిన అప్రిలియా ఎస్ఆర్ 160ని ఇక్కడ ప్రదర్శించారు. పియాజియో విడుదల చేసిన అత్యంత వేగవంతమైన స్కూటర్ ఇది. అత్యద్భుతమైన లుక్, శైలి, 7.5 సెకన్లలోనే గంటలకు 60 కిలోమీటర్ల వేగం అందుకునేలా మెరుగైన పికప్, అత్యున్నత ప్రదర్శనతో అభిమానులకు ఇది ఫేవరెట్‌గా మారే అవకాశం ఉంది. దీనిని టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కూడా అందించారు.

ride1.jpg

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహించే షైన్ ఎన్జీవో(Shine NGO) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. నగరంలోని పియాజియో డీలర్లు 50కు పైగా హెల్మెట్‌లను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పొలీస్‌‌లకు అందజేశారు. వీటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో 2 వీలర్ జోనల్ బిజినెస్ హెడ్ బిజు సుకుమారన్, రీజనల్ బిజినెస్ మేనేజర్ క్రాంతి కుమార్, డీలర్ పార్టనర్లు, షైన్ ఎన్జీవో ఫౌండర్ సీహెచ్ పరమేశ్వరి, సీఈవో సీహెచ్ మధుసూదన్ గౌడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T19:54:30+05:30 IST